పురాణాలలో అందరూ దేవతలకు ఆయుధాలు సహజం. దేవతలకు రాజైన ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం. ఈ వజ్రాయుధం చాలా సందర్భాల్లో దేవతలను కాపాడింది. ఈ వజ్రాయుదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది లోహాలతో కాకుండా ఒక ముని వెన్నుముక తో తయారు చేయబడింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. త్వష్ట అనే ప్రజాపతి కి సర్వ విజ్ఞాన పరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి మూడు తలలు. విశ్వరూపుడు ఒక నోటితో సురాపానం ఒక నోట సోమపానాన్ని చేస్తాడు. మూడవ నోటితో ఆహారం తినేవాడు.దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు. అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు. గురువు స్థానంలో ఉన్న విశ్వరూపున్ని పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వ శ్రేష్ఠున్ని చంపి ఇంద్రుడు బ్రహ్మ హత్యాదోషం మూటగట్టుకున్నాడు. ఆ హత్యాదోషాన్ని ఒక యేడు భరించగలిగాడు.