Home Unknown facts శివుడు బిక్ష యాటన చేయడం వెనుక కారణం ఏంటి ?

శివుడు బిక్ష యాటన చేయడం వెనుక కారణం ఏంటి ?

0

త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మరి శివుడు బిక్ష యాటన ఎందుకు చేసాడు? ఆ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva

సతీదేవి తన తండ్రి చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్లగా అక్కడ తన భర్తైనా శివుడికి అవమానం జరుగగా ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకొని మరణించింది. ఆ తరువాత ఆమె పర్వత రాజు కూతురు పార్వతీదేవిగా జన్మించింది. అయితే పెరిగి పెద్దగైన పార్వతీదేవి శివుడిని తప్ప మరెవరిని చేసుకోనని పట్టుబడింది. ఒకరోజు శివుడు హిమాలయాల్లో తపస్సు చేస్తుండగా ఆ విషయం నారదుడు చెప్పగా పార్వతి దేవి శివుడి దగ్గరికి వెళ్లి శివుడిని ఆరాధించసాగింది. ఆ సమయంలోనే మన్మధుడు బాణం వేసి శివుడికి తపో భంగం కలిగించాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేసాడు.

ఇలా శివుడు మన్మధుడిని అంతం చేసి ఏటో వెళ్లిపోగా పార్వతి దేవి శివుడు జాడకోసం వెతుకగా నారదుడు వచ్చి శివుడు బిక్షాటనతో దేశసంచారం చేస్తున్నాడు, నీవు కాశీకి వెళ్లి అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తూవుండు ఏదో ఒకరోజు శివుడు తప్పకుండ నీకు కనిపిస్తాడని నారదుడు చెప్పడంతో ఆమె కాశీకి వెళ్ళింది. అయితే కాశీకి వచ్చిన పార్వతీదేవి అక్కడికి వచ్చిన భక్తులకి అన్నదానం చేస్తుండంతో ఆమెని అన్నపూర్ణాదేవి అని పిలుస్తుండేవారు. ఒక రోజు సాక్షాత్తు శివుడే పార్వతీదేవి దగ్గరికి వచ్చి బిక్షం వేయమని ప్రార్ధించగా, ఆమె బిక్షం వేస్తుండగా ఆమె స్పర్శతో వచ్చినది సతీదేవి అని ఆమెనే ఇలా అన్నపూర్ణాదేవిగా వచ్చిందని గ్రహించాడు.

ఈవిధంగా కాశి అన్నపూర్ణ శివుడికి బిక్షం వేసిన సందర్భం వచ్చినదని అప్పటినుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో వెలిసిందని పురాణం.

Exit mobile version