Home Unknown facts ‘Sammakka Saralamma Jatara’ – One Of The Largest Religious, Tribal Festivals Of...

‘Sammakka Saralamma Jatara’ – One Of The Largest Religious, Tribal Festivals Of The World

0

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర. 1996 వ సంవత్సరంలో ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించగా ఈ జాతరని తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే జరుగుతుంది. అయితే ఇటీవలే ఈ జాతర తేదీలను ఖరారు చేసి పూజారులు ప్రకటించారు. మరి మేడారం జాతర ఎప్పుడు? ఏ రోజు జాతర ఏవిధంగా ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sammakka Saralamma Jatara

తెలంగాణ రాష్ట్రంలోని, ములుగు జిల్లాలో, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక మహా జాతరే సమ్మక్క – సారమ్మ జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపుగా కోటికి పైగా భక్తులు వస్తారు. ఇక 2020 లో ఈ జాతర ఉండగా తొమ్మిది నెలల ముందే ఈ జాతరకు సంబంధించిన తేదీలను పూజారులు ప్రకటించారు.

ఇక విషయంలోకి వెళితే, మాఘ శుద్ధ పౌర్ణమి ఘడియలను ఆధారం చేసుకొని 2020 ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జాతర ఉంటుందని పూజారులు నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి 5 వ తేదీన జాతర ప్రారంభం అవ్వగా, ఆ రోజు సారక్క, గోవిందరాజు, పగిడ్దిరాజు గద్దెలపైకి చేరుకుంటారు. చిలకలగుట్ట నుండి సమ్మక్క ఫిబ్రవరి 6 వ తేదీన గద్దెపైకి చేరుకుంటుంది. ఇక ఫిబ్రవరి 7 వ తేదీన గద్దెలపై కొలువై ఉన్న సమ్మక్క – సారక్కని భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక ఫిబ్రవరి 8 వ తేదీన జాతర చివరి రోజు ఇద్దరు దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర అనేది పూర్తవుతుంది.

ఇది ఇలా ఉంటె, దాదాపుగా 900 వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 వ సంవత్సరం వరకు మేడారంలోని చిలకల గుట్టపైన నివసించే గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. 1940 తరువాత ఈ జాతర అందరు జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాలనుండే కాకుండా మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యల్లో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

Exit mobile version