Home Unknown facts Shivudiki mugguru kuthurulu, vaaru evaroo telusaa?

Shivudiki mugguru kuthurulu, vaaru evaroo telusaa?

0

పరమేశ్వరుడు అయినా శివుడికి వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కుమారులు అని అందరికి తెలుసు. అయితే మనలో చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే శివపార్వతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని పురాణాలూ చెప్పుతున్నాయి. మరి వారి పేర్లు ఏంటి? వారి జన్మ రహస్యాలు ఏంటి అనేది మనం ఇపుడు తెల్సుకుందాం.shivudu

అయితే అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శిడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.

అశోక సుందరి:

పార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మ పురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది. అశోక అంటే పార్వతీదేవి యొక్క శోకం, సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.

జ్యోతి:

ఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు. జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి, జ్వాలాముఖిగా పూజిస్తారు.

మానస:

శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల ఈమె పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు..పార్వతి కూతురు కాదని పురాణాలూ చెబుతున్నాయి. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. ఎందుకంటే బెంగాలీలో వాసుకి అంటే పాముల రాజు అని అర్ధం.

మానసను అను ఈమెను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు.  వర్షాకాలంలో ఈమెను ఎక్కువగా పూజిస్తారు. ఎందుకంటే సమయంలో పాములు యాక్టివ్ గా ఉంటాయి. అలాగే ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని అక్కడి భక్తులు నమ్ముతారు.

 ఈవిదంగా శివుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని మన పురాణాలూ చెబుతున్నాయి.

Exit mobile version