Home Unknown facts Shivudu kondadeveragaa velisina aalaya visheshalu

Shivudu kondadeveragaa velisina aalaya visheshalu

0

పరమశివుడు ఎక్కువగా కొండలు, అడవులు, గుహల్లో వెలిశాడని పురాణాలూ చెబుతున్నాయి. శివుడికి త్రినేత్రుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు, బోలా శంకరుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటాము. అయితే ఇక్కడ వెలసిన శివుడిని భక్తులు కొండదేవరగా కొలుస్తున్నారు. మరి ఆ ఆలయ రహస్యాలు ఏంటి? ఆలా ఎందుకు పిలుస్తున్నారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.kondra deva shivuduనిజామాబాద్ జిల్లా లోని చిన్నకోడప్ గల్ అనే అటవీ ప్రాంతంలో ఒక శివలింగం ఉంది. ఈ ప్రాంతంలో కనిపించే పుట్టలను కూడా స్థానికులు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఒకప్పుడు తపస్సు చేసుకున్న మునులపై పెరిగిన పుట్టలుగా వీటిని చూస్తుంటారు . వాటి పవిత్రతకు భంగం కలిగించకుండా కాపాడుతుంటారు. ఇక ఈ మునులే సర్పరూపంలో స్వామివారిని సేవిస్తూ ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇక్కడ తిరిగే సర్పాలకు కూడా వాళ్లు హాని తలపెట్టరు. ఒకప్పుడు అడవిగా కనిపించిన ఈ ప్రదేశం నేడు భక్తుల రాకపోకలకు అనుకూలమైనదిగా మారిపోయింది. అయితే వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రదేశానికి కూడా వచ్చారనీ, ప్రస్తుతం ఇక్కడ పూజలు అందుకుంటోన్న శివలింగం శ్రీరాముడు ప్రతిష్ఠించినదేనని చెబుతారు. ఆ తరువాత కాలంలో ఎంతోమంది మహర్షులు మునులు ఇక్కడి స్వామిని సేవించారని చెబుతుంటారు. ఈ ఆలయ విశేషం ఏంటి అంటే శివుడితో పాటు నాగరాజు శిలా రూపంలో కనిపిస్తూ ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పూర్వం ఇక్కడ నాగరాజు సంచరించిన ఆనవాళ్ళే కాకుండా ఇప్పుడు నాగరాజు స్వయంగా స్వామివారి సన్నిధిలో కనిపిస్తూ ఉండటమనేది ఒక మహిమాన్వితమైన సంఘటనగానే పరిగణించడం జరుగుతుంటుంది. ఇప్పటికీ కూడా ఆ నాగరాజు వచ్చి వెళుతూనే ఉంటుంది. చాలామంది భక్తులకు అది దర్శనమిచ్చిందని కూడా చెబుతుంటారు. ఈ పాము నాగదేవతనీ, అందువల్లనే అది పాకిన చోట గుర్తులు పడుతుంటాయని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా అక్కడి రాళ్లపై పాము ఆకారంలో గల అనేక ఆనవాళ్లను చూపిస్తుంటారు.అప్పట్లో కొండప్రాంతం వాళ్లు మాత్రమే ఆరాధించిన దైవం నేడు అందరికీ దర్శనభాగ్యాన్ని కలిగిస్తున్నాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన దేవుడు, సర్పరూపాల్లో మునుల ఆరాధనలు అందుకున్న దేవుడు ఇంకా కొండదేవరగా పాలు, తేనె ఆరగించిన దేవుడు కావడం వలన ఈ క్షేత్రం విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారిని కోరికలు నెరవేర్చు కొండదేవరగానే కొలుస్తుంటారు. ఇంకా భక్తులు ప్రతియేటా స్వామికి జాతర నిర్వహిస్తూ మొక్కుబడులు చెల్లిస్తుంటారు.ఇలా పరమశివుడు కొండదేవరగా కొండప్రాంతంలో వెలసి అక్కడి భక్తుల పూజలందుకుంటున్నాడు.

Exit mobile version