ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజుల్లో సాధారణంగా మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అదే ఒక వింత. అయితే కొన్ని సంవత్సరాల క్రిందట వారణాసిలో మహష్టి మురాసి అనే వ్యక్తి 179 ఏళ్లు బ్రతికాడని ప్రపంచంలో ఆయనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో చోటు కూడా సంపాదించాడు. కానీ అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఈయన ఏకంగా 256 సంవత్సరాలు బ్రతికాడని చెబుతున్నారు. మరి ఇంతకీ ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్న అయన ఎవరు? అయన ఎక్కడ జన్మించాడు? ఆయన గురించి కొన్ని ఆశ్చర్యకర నిజాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్ చై న్యూయార్క్ టైమ్స్ తో తెలిపిన కథనం ప్రకారం. చైనాలో జన్మించిన లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికినట్లు తెలిపారు. ఈయన 1827సం.లో 150 పుట్టినరోజు, 1877 సం.లో 200 పుట్టిన రోజు జరుపుకున్నట్లు చైనీస్ గవర్నమెంట్ రికార్డులో నమోదైనట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1928 ఆదారాలతో సహా వెలుగులో తెచ్చింది. ఈ కథనాన్ని 1930 లో ప్రచురించింది.
ఇక ఈయన విషయానికి వస్తే, లీ చింగ్ యుయెన్ 10 సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ కాలం జీవించే గుణాలు కలిగిన లింజై, గోజీ బెర్రీ, జిన్సెంగ్, గోటుకోలా వంటి ఔషదాలను 40సంవత్సరాల దాకా ఆహారంగా తీసుకున్నాడు. అయితే యుద్ద విన్యాసాల్లో ఆరితేరిన లీను 1749 సం.లో అంటే 71 సంవత్సారల వయస్సులో చైనా సైన్యానికి యుద్ధ విన్యాసాలను నేర్పే గురువుగా తీసుకున్నారు. చింగ్‌కు 24 మంది భార్యలు, 200 మంది పిల్లలు ఉన్నారు. అతను మొత్తము 11 తరాలను చూశాడని వెల్లడించారు.
ఇంకా ప్రొఫెసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఎప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. వ్యాయామంతో శ్వాసకు సంబంధించిన పద్దతులు అవలంభించడం, తనకిష్టమైన తాబేలు పిల్లలా పరుగులు తీయడం, పక్షుల్లాగా నిద్రపోవడం, ఇలా తను పాటించిన ఆహారపు అలవాట్ల వల్లే ఇన్ని సంవత్సరాలు బ్రతికాడని తెలిపారు.
ఇలా లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు పాటు బ్రతికి ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.