Home Unknown facts దానశీలుడైన శిబి చక్రవర్తి లింగరూపంలోకి ఎలా మారాడు?

దానశీలుడైన శిబి చక్రవర్తి లింగరూపంలోకి ఎలా మారాడు?

0

మన పురాణం కథల్లో శిబి చక్రవర్తి విని ఉంటాం. ఈయన గొప్ప దానశీలుడని పురాణాలూ చెబుతున్నాయి. మరి అంతటి గొప్పవాడైన శిబి చక్రవర్తి లింగరూపంలో మారడం వెనుక ఒక పురాణ కథ ఉంది. మరి అయన ఎందుకు లింగరూపంలో మారాడు? అలా లింగరూపంలో వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Kapoteswara Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరుజిల్లా నకరికల్లు మండలం లో చేజెర్ల అనే గ్రామంలో పురాతనమైన కపోతేశ్వరస్వామి దేవాలయం ఉంది. దానశీలుడైన శిబిచక్రవర్తి లింగరూపంలో వెలసిన క్షేత్రంగా చేజెర్ల కపోతేశ్వరాలయం ప్రతీతి. ఈ చారిత్రక గ్రామానికి దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక ఆలయ స్థ పురాణానికి వస్తే, కాశ్మీరుని పాలించే శిబిచక్రవర్తి పెద్ద తమ్ముడు ఇంకా రెండవ తమ్ముడు తీర్థయాత్రలు చేస్తూ గుంటూరు జిల్లా, చేరుంజర్ల గ్రామానికి వచ్చారు. ఇక్కడి పర్వత గుహల్లో తపస్సు చేసి వారు దేహ త్యాగం చేసి లింగాకారులై వెలిశారు. అది తెలిసిన శిబిచక్రవర్తి తన సోదరుల్లాగా ముక్తి పొందాలని ఇక్కడికి చేరుకొని నురుయాగాలు తలపెట్టాడు.

అయితే ఆ సమయంలో దేవతలు ఆయనని పరిక్షించాలని తలచి పావురం, కిరాత రూపధారులై వచ్చారట. కిరాతుడు వేసిన బాణానికి కాలు విరిగిన పావురం కుంటుకుంటూ శిబిని శరణు కోలుకుంది. అప్పుడు దానిని తనకు ఇవ్వమని కిరాతుడు శిబిని అడగగా అందుకు అయన అంగీకరించలేదు. అప్పడు బదులుగా పావురం ఎత్తు మాంసాన్ని తన దేహం నుండి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు.

త్రాసులో ఒకవైపు పావురాన్ని ఉంచి రెండవ వైపు తన సాయిరాం నుండి ఎంత మాంసం వేసిన అది పావురం బరువుతో సరితూగలేదు. చివరకు శిబి తన శిరస్సును నరుక్కునే ప్రయత్నం చేయడంతో దేవతలు ప్రత్యక్షమయ్యారు. అతని దాన శిలకు మెచ్చి, ఏదైనా వరం కోరుకో అనగా అందుకు అయన తనకు శివైక్య సంధానం కలిగించాలని కోరాడు. ఆలా కపోతాన్ని రక్షించి, శిబి లింగాకృతిని దాల్చినందు వల్ల ఆ లింగానికి కపోతేశ్వర లింగమని పేరొచ్చింది.

ఇలా జరిగిందనే దానికి నిదర్శనంగా ఆ లింగం పైన గంట్లు కనిపిస్తాయి. శిబి దేహం నుంచి తీసిన మాంసానికి ఈ గుంట్లే గుర్తు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ లింగానికి కుడి ఎడమల రెండు బిలాలు ఉన్నాయి. కుడిబిలంలో ఒక బిందె నీరు పడుతుంది. ఎడమ బిలంలో ఎంత నీరు పోసిన నీరు నిండనే నిండదు. ఇంకా సాధారణానికి బిన్నంగా ఈ ఆలయంలోని నందీశ్వరుడు కపోతేశ్వరుడిని కుడి కంటితో వీక్షించడం మరో విశేషం. ఈవిధంగా శిబి చక్రవర్తి దానశీలుడై పావురం కోసం తననే బలి ఇవ్వడానికి సిద్దమై మోక్షాన్ని పొంది లింగరూపంలో ఇక్కడ వెలసి భక్తులచే పూజలనందుకొనుచున్నాడు.

 

Exit mobile version