Home Unknown facts స్వామి రెండు అవతారాలు కలిసి ఒకటే రూపంలో ఎందుకు వెలిశాడో తెలుసా ?

స్వామి రెండు అవతారాలు కలిసి ఒకటే రూపంలో ఎందుకు వెలిశాడో తెలుసా ?

0

సింహాచలం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ఆదాయం కలిగిన క్షేత్రం కావట విశేషం.. విష్ణుమూర్తి  వరాహవతారం, నరసింహావతార  రూపాలు కలసి వరాహ నరసింహ రూపంలో కొలువై ఉన్నాడు.. అయితే ఇక్కడి స్వామి నిజరూపంలో దర్శనమీయడు. చందనంతో పూత వేసిన రూపాన్ని మాత్రమే దర్శిస్తాము.. సింహాచల పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం ఏంటి.. ఇక్కడి స్వామి రెండు అవతారాలు కలిసి ఒకటే రూపంలో ఎందుకు వెలిశాడో తెలుసుకుందాం..

Simhachalamశ్రీవరాహనృసింహస్వామి స్వయంభూగా వెలసిన మహా పుణ్యక్షేత్రం సింహాచలం. భక్తులందరూ సింహాద్రి అప్పన్నగా కొలుస్తారు.. స్వామి కొలువై ఉన్న కొండ సింహం ఆకారంలో కనబడేదట. ఆ కారణంగా ఈ కొండకు సింహాచలం అనే పేరు వచ్చిందట. ఈ కొండ మీద వెలసిన దేవుడు కాబట్టి స్వామికి సింహాచలేశుడుఅనే ప్రసిద్ధి కలిగినది. దీనినే సింహాద్రి అని కూడా అంటారు..

పురాణకథనాల ప్రకారం వైశాఖ మాస శుక్ల పక్షం నాడు పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధశినాడు పగలు,రాత్రి కాని సాయంసంధ్యా సమయంలో పూర్తిగా నరుడు, మృగం కాకుండా ఆ రెండూ కలసిన శరీరంతో  సుమారు పది తాటిచెట్ల పొడవున్న పరిమాణంతో ఆవిర్భవించాడు నరసింహస్వామి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఎత్తిన దశావతారాలలో నాలుగవది నృసింహావతారం. అయితే సింహాచలంలో మనం దర్శించుకుంటున్నది వరాహనరసింహస్వామిని.

దీనికి సంబంధించి ఒక పురాణకథ ప్రాచుర్యంలో ఉంది.. .

ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. ఎపుడు విష్ణు నమ స్మరణగావిస్తుండేవాడు.. అయితే అతని తండ్రి హిరణ్యకశిపుడుకి కుమారుని విష్ణుభక్తి నచ్చదు.   తన కుమారుణ్ణి విష్ణుభక్తి నుంచి మరల్చటానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కుమారునికి నయాన భయానా నచ్చచెప్పి చూసాడు. అయినప్పటికీ ప్రహ్లాదునిలో ఎటువంటి మార్పూ లేదు. కుమారుణ్ణి మార్చటంలో ఎంతో ప్రయత్నించి విఫలుడైనటువంటి హిరణ్యకశిపుడు ఇక లాభం లేదు..  కఠినంగా శిక్షిస్తే తప్ప కుమారుడు మారదు అనుకుని.. తన సేవకులను పిలిచి ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసినదిగా ఆజ్ఞాపించాడు.

అప్పుడు సేవకులు ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి మీద  సింహగిరి పర్వతాన్ని వేయగా స్వామి వచ్చి రక్షించాడట. ఆ సింహగిరే నేటి సింహాచలం.. మరి ఇక్కడ స్వామి వరాహ,నరసింహస్వరూపుడై ఎందుకు వెలశాడు, నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడట. తన పెదతండ్రిని చంపిన వరాహమూర్తి, తండ్రిని చంపిన నరసింహావతారం కలసి వరాహనరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉండమని వేడుకున్నాడట..

తన భక్తుడైన ప్రహ్లాదుని కోరిక మన్నించి  స్వామి ఇక్కడ వరాహనరసింహ రూపంలో వెలిశాడు. తర్వాత ప్రహ్లాదుడు స్వామి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహస్వామిని పూజించినట్లుగా పురాణ కధనాలు చెప్తున్నాయి. అయితే  కృతయుగం చివరిలో కొంతకాలం ఈ ఆలయం నిరాదరణకు గురై కొంతభాగం భూమిలో కప్పబడిపోయిందట. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశ రాజైనటువంటి పురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్దరించినట్టుగా పురాణ కధనాలు చెప్తున్నాయి. ఒక సందర్బంలో స్వామి కలలో కనపడి తాను సింహాచల కొండ ప్రాంతంలో పుట్టలో వున్నానని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడట. అలా అక్కడ కొలువైన సింహాచలేశుని దేవతలు, మునులు, రాజప్రముఖుల వరకు ఎంతో మంది స్వామిని సేవించి తరించారట. ఇక కలియుగం లో చాళుక్యులు, చోళ, కళింగ రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, ఇతర విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ది కోసం ఎంతో కృషి చేసారు. ఆ రాజా వంశీకులే ఇప్పటికి దేవస్థాన కమిటీని ఏర్పరచి, ఆలయ భద్రతా భాధ్యతల్ని  వహిస్తున్నారు..

Exit mobile version