Home Unknown facts సింధూనది జననం గురించి మత్స్య పురాణంలో ఏమని ఉందొ తెలుసా ?

సింధూనది జననం గురించి మత్స్య పురాణంలో ఏమని ఉందొ తెలుసా ?

0

భారతదేశంలో ముఖ్యమైన నదులలో సింధునది ఒకటి. ఈ నది హిమాలయాలలోని మానస సరోవరం అనే సరస్సు దగ్గర మొదలవుతుందని చెబుతారు. ప్రపంచంలో అతిపొడవైన నదులలో సింధూనది కూడా ఒకటి. ఇంకా సింధూనది జననం గురించి మత్స్య పురాణంలో వివరించబడింది. అంతేకాకుండా సింధూనది పేరుమీదే భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చినదని చెబుతారు. మరి సింధూనది జననం గురించి మత్స్య పురాణంలో ఏమని ఉంది? ఇండియా అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Importance of Indus River

సింధూనది టిబెట్ లోని మానస సరోవరం దగ్గర జన్మించి జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి పాకిస్తాన్ లోని కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధూనది మొత్తం పొడవు సుమారుగా 2880 కి.మీ. హిమాలయాల్లో టిబెట్ లోని కైలాస పర్వతం దగ్గర 17 వేల అడుగుల ఎత్తున సింధూనది మొదలవుతుంది.

ఇక పురాణాల ప్రకారం, భగీరథుడు శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యేక్షమై భగీరథుడి కోసం గంగని ఆకాశం నుండి నేలకు దింపుతానని చెప్పగా అప్పుడు భగీరథుడు గంగ నేరుగా ఆకాశం నుండి భూమిపైకి వస్తే ఆ ప్రవాహానికి భూమి తట్టుకోవడం కష్టమని చెప్పగా అప్పుడు శివుడు తన శిరస్సు నందు గంగని ధరించి శిరస్సు నుండి గంగను భూమి మీదకు వదలగా భూమిపైకి వచ్చిన గంగ ఏడూ పాయలుగా చీలింది. అవి నళిని, హ్లాదిని, ప్లావని, సీత, చక్షుస్సు, సింధు, భాగీరథి.

ఇక సింధునదికి పేరు పెట్టింది ఆర్యులు. అయితే భారతదేశానికి ఇండియా అనే పేరు సింధూనది కారణంగానే వచ్చినదని అంటారు. సింధు అనేది సంస్కృత పదం. సింధు అంటే అతిపెద్ద జలప్రవాహం అని అర్ధం. అయితే సింధు ప్రాంతపు బాషా, చరిత్రపైన పరిశోధన చేస్తున్న ప్రముఖ సింధాలజిస్ట్ అస్కో పర్పోలా ప్రకారం 850-600 బిసి కాలంలో ప్రోటో ఇరానియన్ బాషాని మాట్లాడేవారు ‘స’ ను ‘హ’ గా మార్చి సింధుని హిందుగా మార్చారని చెబుతారు. పూర్వం పర్షియనులు, గ్రీకులు సింధునదికి అవతల ఉండేవారు. అయితే గ్రీకులు ఈ పేరుని ఇండోస్ అని పిలువగా ప్రాచీన రోమన్లు దీనిని ఇండస్ గా వ్యవహరించారు. ఇండస్ అంటే నది ఉన్న దేశం అని అర్ధం. అలెగ్జాండర్ భారతదేశంలోకి వచ్చిన విధానాన్ని అయన సైనికాధికారి నీర్చస్ ఇండికా అనే పేరుతో ఒక పుస్తకాన్ని వ్రాసాడు. ఈవిధంగా గ్రీకు మరియు లాటిన్ నుండి భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చినదని చెబుతారు.

ఇక సింధూనది విషయానికి వస్తే, సింధునదికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులు. సింధూనది పొడవు 2880 కిలోమీటర్ల ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం 709 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. అయితే బ్రిటిష్ వారు రచించిన భారతదేశ చరిత్ర చాలా హీనంగా ఉండగా 1920 లో సింధూనది తీరాన బయటబడ్డ భారతదేశ నాగరికత అవశేషాలు బ్రిటిష్ వారు భారతదేశంపైన చిత్రీకరించిన అపోహలన్నీ కూడా తొలగిపోయాయి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరానికి పూర్వమే భారతదేశానికి ఎంతో నాగరికత, సంస్కృతి ఉందని మన ప్రాచీన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలిచింది సింధూనది.

సింధూనది ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో హరప్పా, మొహంజోదారో నగరాలూ బయటపడగా భారతదేశ ఘన చరిత్ర ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక పుష్కరాలు వచ్చే నదులలో సింధూనది 11 వది, గురుగ్రహం కుంభరాశిలో ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి.

Exit mobile version