Home Unknown facts ఉత్తమ గతులు పొందాలంటే చేయవల్సిన పుణ్యకార్యాలు ఏంటో తెలుసా ?

ఉత్తమ గతులు పొందాలంటే చేయవల్సిన పుణ్యకార్యాలు ఏంటో తెలుసా ?

0

గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి… తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది.ఇందులో వ్య‌క్తులు చేసిన పాపాల‌కు గాను న‌రకంలో విధించే శిక్ష‌ల వివ‌రాలు ఉంటాయి.

garuda puranamకొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి… బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకానికి వెళతారు, నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది.

పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయ శాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటి వారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడు మాటలు పలికేవారు, పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి చేసే వారు, పరనింద చేసేవారు. అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణమార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే

అంతేకాదు గరుడపురాణం, కథోపనిషత్తుల ప్రకారం మనిషి మరణించే సమయంలో వారి ప్రాణాలను తీసుకుని పోవడానికి యమధూతలు వస్తారు. వారు నల్లని శరీర ఛాయా తో నల్లని దుస్తులు ధరించి ఉంటారు. చూడగానే భయపడే విధంగా ఉండే వారిని చూసి మరణించిన ఆత్మ భయపడుతుంది.

వ్యక్తి ఆత్మను యమధూతలు తీసుకుపోయే సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం దిగువభాగం జారుతుంది. ఈ పరిస్థుతుల్లో భయం కారణంగా మలం, మూత్రం బయటకు వస్తుంది. దీనికి విరుద్ధంగా ఆత్మలు బయటకు వస్తాయి. ఈ విధంగా జరగకూడదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు.

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు(నవ రంధ్రాలు) ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు అంటే సకారాత్మక క్రియలు చేసినవాళ్లు శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఉంటాయి. జీవితాంతం సద్గుణమైన పనులు చేయడంలో నిమగ్నమైన వాళ్లు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు. వారి ఆత్మలు ఈ ద్వారాల గుండా బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుందని నమ్మకం. కళ్లు నుంచి బయటకు వస్తే కళ్లు మూసుకోరు, చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోరు నుంచి అయితే నోరు తెరుచుకుంటుంది.

బతికున్న రోజుల్లో ఎలాంటి పనులు, వ్యవహారాలు చేసినప్పటికీ మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే వారు స్వర్గానికి వెళతారని నమ్ముతారు. ఇదే సమయంలో తప్పు లేదా పాపం చేసిన, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే వారిక పరలోకం ప్రాప్తిస్తుంది. మరణభయంతో చనిపోయిన వారికి నరకానికి వెళ్తారని చెబుతారు. కొంతమంది చేసిన పాపాలు పోవడానికి ఎన్నో రకాల దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఎన్ని పాపాలు చేసినా, వారి దానాల వల్ల వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి.

Exit mobile version