శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమివ్వడం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మణిపూర్ లోని ఇంపాల్ నగరంలో గోవిందజీ ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఆలయాలలో ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఒకప్పటి మణిపూర్ రాజుల భవనాల పక్కనే ఈ ఆలయం అనేది ఉంది. ఇది వైష్ణవులకి చాలా ప్రధానమైన చారిత్రక ప్రదేశం. ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయం రెండు బంగారు డోములతో ఎంతో అందంగా నిర్మించారు. ఈ ఆలయ గర్భగుడిలో ప్రధానదేవతలుగా బలరామకృష్ణులు, రెండవ ప్రక్కన జగన్నాధుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయం 1868 లో భారీ భూకంపం రాగ చాలా వరకు ధ్వసం అయింది. అయితే ఆ తరువాతి కాలంలో చంద్రకీర్తి అనే మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్దించి తిరిగి ఈ ఆలయానికి వైభవాన్ని తీసుకువచ్చారు.
ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీమహావిష్ణువు. ఈ స్వామి సృష్టి , స్థితి, లయకారులలో ఒకరిగా, శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో పూజించబడుతున్నాడు. ఈ ఆలయం ఎర్రటి ఇటుక రాళ్లతో మధ్యయుగ నిర్మాణ శైలిలో నిర్మించబడినది. ఈవిధంగా ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆలయంగా చెప్పబడే ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.