మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు.. కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు..