Home Unknown facts రామసేతుకి ఉపయోగించిన రాళ్ళూ లభించే పుణ్యస్థలం గురించి మీకు తెలుసా?

రామసేతుకి ఉపయోగించిన రాళ్ళూ లభించే పుణ్యస్థలం గురించి మీకు తెలుసా?

0

రామాయణంలో రావణుడు సీతని అపహరించి లంకకి తీసుకెళ్లిన తరువాత రాముడు వానర సైన్యం సహాయంతో శ్రీరాముడు సముద్రపైన లంకకి చేరుకోవడానికి ఒక వారధిని నిర్మిస్తారు. ఆ వారధినే రామసేతు అని పిలుస్తారు. అయితే రామసేతు మొదలయ్యే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ పుణ్యస్థలంలో రామసేతుకి ఉపయోగించిన రాళ్ళూ ఇప్పటికి ఇక్కడ కనిపిస్తున్నాయట. మరి ఒకప్పటి ఈ పుణ్యస్థలంగా ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

danush kotiతమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడ ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ రాముడు సేతువుని ఇక్కడే నిర్మించాడని తెలుస్తుంది. శ్రీరాముడు తన ధనుస్సు కోనతో వంతెనను పగలకొట్టడం వలన ఈ ప్రాంతానికి ధనుష్కోటి అనే పేరు వచ్చినది అని చెబుతారు. అయితే రామేశ్వరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధనుష్కోటి అనే గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. పూర్వం కాశి తీర్థయాత్ర, రామేశ్వరంలో పూజచేసి, ధనుష్కోటి వద్ద ఉన్న సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిదే యాత్ర పూర్తి కాదని భావించేవారు.

ఈ ప్రదేశంలో ఇప్పటికి రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళూ మనకి కనిపిస్తాయి. ఇక ఇక్కడినుండే రామసేతు వంతెన నిర్మించి లంకకి కలిపేలా చేయబడిందని చెబుతారు. అయితే ఒకప్పుడు పైకి కనిపించే ఈ దారి తుఫానుల ప్రభావం వలన సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ ఉన్న ఇసుకతో ధనుస్సు ప్రతిమ చేయించి పువ్వులతో పూజించి దూరంగా కనిపించే సేతువు అవశేషాలకు మ్రొక్కుతారు.

ఇక ప్రస్తుతం ఈ క్షేత్రం పూర్తిగా సముద్రంలో మునిగిపోవడం వలన ఇక్కడ చేయగలిగే స్నానాలు, పూజలు రామేశ్వరంలోనే పురోహితులచే చేయబడుచున్నవి. ఇక్కడ కేవలం తొమ్మిది రాతిబండలు వరుసగా కనిపిస్తాయి. వీటిని భక్తులు నవగ్రహాలుగా భావిస్తారు. ధనుష్కోటిని దర్శనం చేసుకుంటే పిల్లలు లేని దంపతులకి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయతాయని నమ్ముతారు.

Exit mobile version