ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ 5 ఆలయాలలో ఒక్కో ఆలయంలో ఒక్కో అద్భుతం దాగి ఉంది. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నవి? ఆ ఆలయాల్లో ఉన్న అద్భుతాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సంగమేశ్వర ఆలయం :
నేతి శివలింగం :
వేదగిరీశ్వర్:
తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా, తిరుక్కళికుండ్రం అనే పట్టణంలో ఒక కొండపైన వేదగిరీశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని డేగల దేవాలయం అని కూడా అంటారు. అయితే ఆలయ పూజారి ఒక పెద్ద పాత్రలో ప్రసాదం లాంటి పాయసం తయారుచేసుకొని వచ్చి గుడి పక్కన ఉన్న ఆవరణలో ఒక చోట కూర్చుంటాడు. ఇక సరిగ్గా 12 గంటల సమయంలో కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. వాటిని చూసిన అర్చకుడు ఒక పళ్లెం మీద మోత మ్రోగిస్తూ ఆ పక్షులకి సంకేతాన్ని తెలియచేస్తాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న పక్షులలో రెండు పక్షులు అతని ముందు వాల్తాయి. అప్పుడు ఆ పూజారి వద్ద ఉన్న పాత్రలోని పాయసాన్ని కొంత ఆ రాతిపైన ఉంచుతాడు. ఆ పక్షులు ఆ పాయసాన్ని కొంచం తిని వెంటనే ఎగిరిపోతాయి. ఈ వింత ఆచారం ఎప్పటినుండో కొనసాగుతుండగా సరిగ్గా 12 గంటలకి ఆ పక్షులు వచ్చి పాయసం తాగడం అనేది ఇప్పటికి ఒక అద్భుతంగా భావిస్తారు.
శివ గంగ గంగాధరేశ్వర ఆలయం:
జ్వాలాముఖి ఆలయం:
హిమాచల్ ప్రదేశ్, కాంగడా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి ఆలయం ఉంది. మన దేశంలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వలన అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ తొమ్మిది జ్యోతిలు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్నీ తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా, ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంద్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాలా నిరంతరం వెలుగుతుండగా, ఆ జ్వాలా సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు.