Home Unknown facts తిరుమల జాపాలి తీర్థ రహస్యం గురించి తెలుసా?

తిరుమల జాపాలి తీర్థ రహస్యం గురించి తెలుసా?

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే తిరుమల తిరుపతి లో తప్పకుండ దర్శించాల్సిన ప్రదేశం జాపాలి తీర్థం. మరి జాపాలి తీర్థ రహస్యాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

tirpathi anjaneyuduతిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగ 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యంలో జాపాలి తీర్థం ఉంది. దీనినే జాబాలి తీర్థం అని కూడా పిలుస్తారు. జాబాలి మహర్షి శ్రీరాముని కోసం తపస్సు చేసిన ప్రాంతం ఇది అని చెబుతారు. ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఇక్కడి జాబాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం.

ఇక్కడ రామకుండ్, సీతాకుండ్ తీర్దాలు ఉన్నవి. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చాడని, శ్రీరాముడు స్నానమాచరించిన తీర్దానికి రామకుండ్ అని, సీతాదేవి స్నానమాచరించిన తీర్దానికి సీతాకుండ్ అనే పేరు వచ్చినదని పురాణం. ఇక్కడి రామకుండ్ తీర్థంలో ఏడు మంగళవారాలు స్నానం ఆచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

ఇది ఇలా ఉంటె మరొక కథ ఆధారంగా, దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు రామావతారం అవతరించాడు నిర్ణయం జరుగగా, జాబాలి అనే మహర్షి ఆంజనేయస్వామి రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకోగా, ఇక్కడ రుద్రుడు ఆ మహర్షి తపస్సుకి మెచ్చి తన రాబోయే అవతారం గురించి చూపిస్తాడు. అదే ఆంజనేయస్వామి అవతారం. మరొక కథ ఆధారంగా అంజనాదేవికి హనుమంతుడు ఇక్కడే జన్మించాడని పురాణం.

ఈ విధంగా తిరుమల కొండపైన 108 పుణ్యతీర్దాలు ఉండగా అందులో ఒకటిగా ప్రసిద్ధి చెందిన, హనుమంతుడు స్వయంభువుగా వెలసిన జాబాలి తీర్థం లో స్నానమాచరిస్తే, హనుమంతుడిని దర్శనం చేసుకుంటే గ్రహ బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

Exit mobile version