Home Unknown facts అశ్వమేధయాగం ఉద్దేశం ఏంటి? ఈ యాగాన్ని ఎందుకు చేస్తారు ?

అశ్వమేధయాగం ఉద్దేశం ఏంటి? ఈ యాగాన్ని ఎందుకు చేస్తారు ?

0

వేదకాలం నుండి రాజ సంప్రదాయంలో అతి ముఖ్యమైనది అశ్వమేధయాగం. ఈ యాగం గురించి యజుర్వేదం లో ఉంది. మరి ఈ యాగం ఉద్దేశం ఏంటి? ఈ యాగాన్ని ఎందుకు చేస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ashwamedha Yagam

అశ్వమేధయాగాన్ని కేవలం రాజ వంశులు మాత్రమే చేస్తారు. ఈ యాగానికి 20 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి గుర్రాన్ని మాత్రమే వాడతారు. ఈ యాగాన్ని సాధారణంగా రాజ్యంలో నీరు లేక కరువు ఏర్పడినప్పుడు జల సదుపాయం కోసం చేస్తారు. అశ్వనికి అర్ధం గుర్రం, రంగు, నీరు అనే అర్దాలున్నాయి. అయితే శతపద బ్రాహ్మణంలో ఒకచోట సోముడి కంటి నుండి జలజలా కరంగా ఆ జలం నుండే గుర్రం పుట్టినది. అశ్రువుల నుండి పుట్టిన జివి కనుక దాన్ని అశ్వం అని అన్నారు.

ఈ యాగానికి అన్ని శుభలక్షణాలు ఉన్న గుర్రాన్ని చూసి స్వేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేసి దాని వెనుక కొంత సైన్యం వెళుతుంది. ఈ అశ్వం పక్క రాజ్యాలకి వెళ్ళగానే అక్కడి వారు గుర్రం కలవారికి కరువు వచ్చినదని వారికీ సహాయం చేస్తారు లేదా గుర్రాన్ని బంధించగా అశ్వం వెంట వచ్చిన సైనికులు వారథి యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచిన సంధి ఉంటుంది. ఇలా అశ్వాన్ని బంధించేవారు కరువు వచ్చిన రాజ్యానికి విలువైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చివరకు యాత్ర అనేది ముగిస్తుంది.

ఈవిధంగా యాత్ర ముగిసాక దేవతలను తృప్తి పరిచేవిధంగా యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో అశ్వాన్ని బలిస్తారు. ఇక గుర్రం యొక్క అంగాలు దేవుళ్ళకి నైవేద్యముగా స్వాహా అంటూ అగ్నిగుండంలో వేస్తారు. రామాయణం, మహాభారతం ఇతర పురాణాల గురించి చెప్పే గ్రంధాలలో అశ్వమేధం గురించి వివరంగా చెప్పబడింది.

Exit mobile version