Home Unknown facts స్వర్గ ప్రవేశానికి కాపలాగా ఉండే ఐరావతం గురించి కొన్ని నిజాలు

స్వర్గ ప్రవేశానికి కాపలాగా ఉండే ఐరావతం గురించి కొన్ని నిజాలు

0

ఐరావతం ఇంద్రుడి వాహనం అని చెబుతారు. ఐరావతం అంటే ఏనుగు. అయితే ఐరావతం జననం గురించి అనేక రకాలుగా చెబుతారు. మరి ఐరావతం ఎలా జన్మించింది? ఐరావతం గురించి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Heaven Guard 'Airavata'

దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుండి ఎన్ని విచిత్రమైన జీవులు ఆవిర్భవించాయి. వాటిలో ఐరావతం అనే ఏనుగు ఒకటిగా చెబుతారు. ఐరావతం పాలవంటి తెల్లని తెలుపు రంగులో ఉంటుంది. ఈ ఏనుగుకి మూడు శిరస్సులు ఉంటాయి. అయితే ఐరావతారానికి, మేఘాలను సృష్టించే ఏనుగు, పోరాడే ఏనుగు, సూర్యుని సోదరుడు వంటి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఐరావతం యొక్క భార్య పేరు ఆభరాము. ఈ ఐరావతానికి ఏడు తొండాలు, నాలుగు దంతాలు ఉంటాయని చెబుతారు.

ఒకప్పుడు హిందూమతాన్ని పాటించిన థాయిలాండ్ లో కూడా ఐరావతం యొక్క ప్రస్తావనలు కనిపిస్తాయి. థాయిలాండ్ లో ఐరావతాన్ని ఏరవన్ అని పిలుస్తారు. ఇంకా కొన్ని హిందూ పండితుల అభిప్రాయం ప్రకారం కన్యప ప్రజాపతి మరియు కద్రువకు జన్మించిన మూడవ కుమారుడే ఐరావతారం అని చెబుతారు. ఈ ఐరావతం భూమి పైన ఉండే సమస్త ఏనుగులకు రాజు అని అంటారు.

పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మనుషులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండగా, అప్పుడు ఇంద్రుడు ఐరావతారం మీద బయలుదేరగా అప్పుడు వృత్తాసురుడు సముద్రంలో దాక్కుంటాడు. అప్పుడు ఐరావతం సముద్రంలోని నీటిని తన తొండంతో నీటిని అంతటిని పిలిస్తు ఆకాశంలోకి వెదజల్లింది. అప్పుడు సముద్రం అంత ఎండిపోగా ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుడిని తేలికగా సంహరించాడు. ఐరావతం ఆకాశంలోకి వెదజల్లిన సముద్రపు నీరే మేఘాలుగా మారి ఆపై వర్షం కురిసింది. అప్పటినుండే భూమి పైన వర్షం పడటం ఆరంభం అయిందని చెబుతారు. ఈ కారణం వలనే ఏనుగులకు వర్షానికి దగ్గరి సంబంధం ఉందని భావిస్తారు.

హైందవ పురాణాల ప్రకారం, స్వర్గ ప్రవేశానికి ఐరావతం కాపలాగా ఉంటుందని చెప్పబడింది. ఇంకా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న ఒక శివాలయంలోని శివలింగానికి ఐరావతం పూజించిందని చెబుతారు. అందుకే ఈ ఆలయంలోని శివలింగాన్ని ఐరావతేశ్వరుడు అని పిలుస్తారని చెబుతారు. అంతేకాకుండా ఐరావతం అష్ట దిగ్గజములలో ఒకటి అని చెబుతారు

Exit mobile version