Home People Some Life Changing & Soul Stirring Lines By Srirangam Srinivas Rao Garu

Some Life Changing & Soul Stirring Lines By Srirangam Srinivas Rao Garu

0

1) నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్

Sri Sri2) కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందేస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో

3) ఈ జన్మని సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురుంచి ఆలోచించడం అజ్ఞానం

4) ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేసాడని,
ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? లే బయలుదేరు
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక సంకెళ్లను తెంచేసుకో

5) విప్లవాన్ని నిషేధించబోవడం అంటే భేరిని జోకొట్టడం లాంటిదే

6) ఏదైనా తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది

7) సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు, పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు…
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుటితో సహా… ఏదీ, ఏదీ ఆగిపోవడానికి వీల్లేదు

8) నువ్వు రోజు అబద్దం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్దం ఆడవలసిన దుస్థితికి తెస్తుంది

9) కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే.. పాకుతూపో, అంతేకాని.. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు

10) తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది

11) ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

12) పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు

13) న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయం కాదు

14) ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి

15) నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం

Exit mobile version