Home Unknown facts పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్న అద్భుత ఆలయం

పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్న అద్భుత ఆలయం

0

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లక్ష్మి పద్మావతి సమేత ఇక్కడ దర్శనం ఇస్తుండగా, ఈ స్వామికంటే ముందే సర్పదేవతైన నాగేశ్వరుడు వెలిసాడని పురాణం. మరి ఇక్కడ నాగేశ్వరుడు ఎలా వెలిసాడు? శ్రీ వేంకటేశ్వరస్వామి ఎవరు ప్రతిష్టించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైకుంఠపురం వెంకటేశ్వరఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలిలో శ్రీ వైకుంఠపురం వెంకటేశ్వర దేవాలయం ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయ ఆవరణలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అనేక కట్టడాలు మనకి దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం గర్భగుడి, అంతరాలయం, మండపం అనే మూడుభాగాలుగా ఉండగా, గర్భాలయంలో లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువై ఉండగా, ఈ స్వామివారికి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం అరణ్యంలో ఉండే ఈ ప్రాంతానికి ఎలాంటి పేరు అనేది లేదు, అయితే ఇక్కడ ఒక పుట్ట ఉండగా అది మాములు పుట్టగానే చాలాకాలం అలానే ఉండిపోయింది. ఒకరోజు ఒక భక్తుడికి నాగేశ్వరుడు కలలో కనిపించి, నేను ఒక పుట్టలో ఉన్నాను, ఆ పుట్ట ఇక్కడి ప్రాంతంలో ఉంది, నీవు నన్ను బయటకి తీసి ఆరాధించు నీకు శుభం కలుగుతుందని చెప్పాడట. మరునాడు తనకి వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెప్పి వెళ్లి అక్కడి పుట్టలో చూడగా నిజంగానే దేవతామూర్తులు ఉండటంతో వాటిని బయటికితీసి ఆ స్వామివారికి నాగేశ్వరుడు అనే పేరుని పెట్టి అక్కడే ప్రతిష్టించి ఆరాధించారు.

ఇలా కొంతకాలం తరువాత ఈ ప్రాంతంలో నాగేశ్వరుడు వెలిసాడని తెలిసిన కంచికామకోటి పీఠాధిపతుల వారు ఈ ప్రాంతానికి వచ్చి ఆ నాగేశ్వరుడిని ఆరాధించి, ఇక్కడే లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి మూర్తిని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణానికి పునాదులు వేసి, ఈ ప్రాంతాన్ని వైకుంఠపురం అని ప్రశంసించాడు. ఇలా కాలక్రమేణా ఈ ఆలయ విషయం అందరికి తెలిసి రోజు రోజుకి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది.

ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడి స్వామివారి సన్నిధిలో ఎక్కువగా కల్యాణాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా సర్పదేవుడైన నాగేశ్వరుడికి, శ్రీ వెంకటేశ్వరస్వామికి వైకుంఠ ఏకాదశినాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Exit mobile version