Home Unknown facts నంది ముఖాల నుండి ఎప్పుడు చల్లని నీరు ప్రవహించే అద్భుతం 

నంది ముఖాల నుండి ఎప్పుడు చల్లని నీరు ప్రవహించే అద్భుతం 

0

నారాయణడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు ముక్తి నారాయణుడిగా పూజలను అందుకుంటున్నాడు. శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాలలో, అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. కానీ ఈ ఆలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు

Muktinath Temple Nepal

ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నేపాల్ దేశంలో మస్తంగ్ జిల్లాలో 12 వేల అడుగుల ఎత్తులో ముక్తినాధ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు కానీ చేతిలో ఎటువంటి ఆయుధాలను ధరించి లేకపోవడం విశేషం. అమ్మవారి నుదుటి భాగం ఈ ప్రదేశంలోనే పడిందని అందుకే 51 శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. అంతేకాకుండా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గరలోనే గండిక నది ప్రవహించడం వలన ఈ అమ్మవారిని గండకీ చండి అనే పేరుతో పిలుస్తుంటారు. హిందువులే కాకుండా బౌద్దులు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు. బౌద్దులు పూజించే అవలోకితస్వర అనే దేవత ఇక్కడే ఉత్బవించిందని వారి నమ్మకం. శైవులకు, వైష్ణవులకు, బౌద్ధులకు ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఇది ఒక్కటే అని చెబుతారు. అయితే టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తుంటారు.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ 108 నంది ముఖాల నుండి ఎప్పుడు చల్లని నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయ దగ్గరలో ఉన్న పుష్కరిణి నుండే ఈ నీరు వస్తుంది. ఇక్కడి వచ్చే భక్తులు అంతటి చల్లటి ప్రదేశంలో కూడా ఇందులో నుండి వచ్చే చల్లటి నీటిలో స్నానం చేస్తుంటారు. భూమి మీద పంచభూతాలు ఒకే దగ్గర వివిధ రూపాలలో దర్శనం ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారితో పాటు శ్రీదేవి, లక్ష్మీదేవి, గరుడాళ్వార్, రామానుజుల వారి పంచ లోహ విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడి స్వామివారికి హారతి అనేది ఇవ్వరు నేతితో దీపం మాత్రమే పెడతారు.

ఈ ఆలయానికి దగ్గరలోనే జ్వాలామాత ఆలయం ఉంది. ఇక్కడ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. దీనిని దైవ మహిమగా భావిస్తూ ఈ జ్యోతిని జ్వాలామాయిగా భక్తులు కొలుస్తారు. ఇంకా ఇక్కడే గండిక నది జన్మస్థలం ఉన్నది. ఇక్కడ దొరికే నల్లని రాయిని సాలిగ్రామం అంటారు. ఇవి గుండ్రని రాళ్ళలా తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తుంటాడు. ఇక ఈ ఆలయాన్ని చేరుకోవడం అనేది అంత సులువు కాదు, నడుచుకుంటూ లేదా గుర్రాల మీద వెళుతూ ఉంటారు. ఇంకా ఇక్కడికి హెలికాఫ్టర్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది. అయితే వేసవి కాలంలో మాత్రమే ఈ ఆలయానికి వెళ్ళడానికి అనుమతి అనేది ఉంటుంది.

ఈవిధంగా ఎన్నో కష్టాలను ధాటి వెళ్ళి ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం వస్తుందని ఒక నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం అని అర్ధం.

Exit mobile version