Home Unknown facts శివుడి విగ్రహ రూపం చాలా అరుదు… కానీ ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఉంది!!

శివుడి విగ్రహ రూపం చాలా అరుదు… కానీ ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఉంది!!

0

త్రిమూర్తులలో ఒకరు మరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. మన దేశంలో శివాలయాలు ఎక్కువగా ఉంటాయి. అందులో అతి ప్రాచీన అద్భుత శివాలయాలు నేటికీ దర్శనమిస్తుంటాయి. ఇది ఇలా ప్రపంచంలో శివుడి అతి పెద్ద విగ్రహం ఎక్కడ ఉందో దాని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…

lord shiva - murudeshwarసాధారణంగా మనం ఏదైనా శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకు ఎక్కువభాగం ఆ పరమ శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. ఏవో కొన్ని ప్రాంతాలలో మినహా మిగతా అన్ని దేవాలయాలలో శివుడు లింగరూపంలోనే కొలువై ఉంటాడు.

ఈ విధంగా ఒక్కో ఆలయంలో ఉన్న శివుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్ని విగ్రహాలకు భిన్నమైన అతి పెద్ద శివుడి విగ్రహం కర్ణాటకలోని హోనావర్‌ పట్టణం దగ్గర్లో శ్రీ మురుడేశ్వర ఆలయంలో ఉంది.

ఈ ఆలయంలో ప్రపంచంలో కల్లా ఎంతో ఎత్తయిన శివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ 123 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహం మనకు కనబడుతుంది.

పురాణాల ప్రకారం రావణాసురుడు గొప్ప శివభక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా శివుడి పై ఉన్న భక్తితో శివుని కోసం తపస్సు చేసి శివుడి నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు.

కానీ శివుడు ప్రసాదించిన ఆత్మలింగం ఎలాంటి పరిస్థితులలో కూడా భూమిమీద పెట్టకూడదనే శరతుతో శివుడు ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు.

రావణాసురుడు ఈ శివలింగాన్ని తన భుజంపై పెట్టుకుని లంకకు బయలుదేరుతున్న సమయంలో మార్గమధ్యంలో సంధ్యాసమయం కావడంతో రావణాసురుడు సంధ్యావందనం చేయాల్సిన పరిస్థితులలో శివలింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు.

అక్కడే ఉన్నటువంటి ఒక బాలుడిని పిలిచి తనకు సంధ్యావందన సమయం అయిందని అంతవరకు ఆత్మలింగాన్ని భూమిపై పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆ బాలుడికి చెబుతాడు. అయితే బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు కావాలనే శివలింగాన్ని భూమిపై పెడతాడు.

సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చిన రావణాసురుడు భూమిపై ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తాలని ఎంత ప్రయత్నించినప్పటికీ శివలింగం రాదు. ఈ క్రమంలోనే ఆ శివలింగంలో ఒక భాగం ఎగిరి దూరంగా పడిందని పురాణాలు చెబుతాయి.

ప్రస్తుతం ఉన్న ఆ ప్రాంతం మురుదేశ్వరాలయం అని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. శివరాత్రి వంటి మహా పర్వ దినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

Exit mobile version