Home Unknown facts ఆశ్చర్యాన్ని కలిగిచే దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి 30 సంవత్సరాలు పట్టిందట

ఆశ్చర్యాన్ని కలిగిచే దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి 30 సంవత్సరాలు పట్టిందట

0

ప్రపంచం అంతటా కూడా హిందూ సంస్కృతి విస్తరించి ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా హిందూ దేవాలయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన కంబోడియాలోని దేవాలయం యొక్క ఆశ్చర్యకర కొన్ని విషయాలను నాసా బయటపెట్టింది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ బయటపడిన ఆశ్చర్యానికి గురి చేసే ఆ రహస్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

NASA, Revealed the Hidden Secrets

ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా కంబోడియా దేశంలో నైరుతి దిశలో ఉన్న ఆంకోర్‌ నగరంలో ఆంకోర్‌వాట్‌ దేవాలయం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. ఈ దేవాలయం 1550 మీటర్ల పొడవు, 1400 మీటర్ల వెడల్పు ఉంటుంది. సూర్యవర్మన్‌ తన మరణానంతరం అస్థికలను జ్ఞాపకార్థం ఉంచడానికి ఈ దేవాలయాన్ని కట్టించాడు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ దాగి ఉంది.

ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌ కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని చెబుతారు.

ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి. ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అద్భుతమైన ఆర్కి‌టెక్చర్‌తో ఈ దేవాలయాన్ని రూపొందించారు.

ఆనాటి ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే.  ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు. ఆ అద్భుత టెక్నాలజీని ఆంగ్‌ కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడటంతో ఆ దేవాలయం ఇప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అర్కియాల జస్టులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.

ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే లాటరైట్ రాళ్లను ఎంపిక చేశారు. అది నాసా తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిపై సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు. పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయి.

ఇక ఈ దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ ను నాసా లేజర్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. గోడలపై ఏనుగులు అలాగే దేవుడి బొమ్మలు అలాగే టవర్స్ వంటి చిత్రాలను గీసారు. ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్ టెక్నాలజీకి వారు ముందు అంకురార్పణ చేశారని అనిపిస్తుంది. సంగీతానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి. అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. వీటితో పాటు రామయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై అబ్బురపరుస్తున్నాయి. సింహాలు, కోతులు, అలాగే ఆంజనేయస్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది.  మొత్తం 500 ఎకరాల్లో దాదాపు 200 పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ అర్కియాలజిస్ట్ సేకరించారు. చీకటి ప్రపంచంలో దాగిన ఈ కళాఖండాలను వెలుగు ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది.

మొత్తం అయిదు శిఖరాలు ఉంటాయి. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి. ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్’ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. ఉషోదయ వేళ గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది.

అసలు విషయానికొస్తే పూర్వకాలంలో కాంబోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతంమంతా హిందూ రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.

భువిలో వైకుంఠాన్ని తలపించే విధంగా ఉండే ఈ ఆలయంలోని నాసా లో బయటబడ్డ  ప్రతిదీ కూడా అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Exit mobile version