మన దేశంలో ఉన్న ఎన్నో ఆలయాలు ఉండగా అన్ని ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం చాలా భిన్నంగా ఉంటుంది. సమస్త జీవరాశిని ఆదుకునే తల్లిగా భక్తులు ఈ అమ్మవారిని కొలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, చెన్నై నగరానికి కొంత దూరంలో మెల్ మర్ వత్తుర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. మెల్ మర్ వత్తుర్ ని ఆది పరాశక్తి పీఠం అని పిలుస్తుంటారు. ఈ పీఠం ఇచ్చే సందేశం ఏంటంటే అందరు కూడా ఒక్కటే ఆ అందరూ కూడా ఆ తల్లికి జన్మించినవారే అని, ఈ ఆలయంలో శక్తిని పూజిస్తారు. ఆ శక్తియే ఆదిమాత అని సమస్త జీవరాశిని ఆదుకునే తల్లి అని నమ్ముతారు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, పూర్వం ఈ గ్రామంలో బంగారు అడిగలర్ అనే అతను వేప చెట్టు నుండి పాలు కారుతుండగా చూసి ఆ తరువాత ఆ విషయాన్ని మరచిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకి గాలి బాగా రావడంతో ఆ చెట్టు విరిగి పడింది. వర్షం తక్కువ అయినా తరువాత ఆ చెట్టు ని తీసివేస్తుంటే అక్కడ ఒక శివలింగం కనిపించింది. అప్పటినుండి అతడు దేవి అంశగా చెప్పుకోవడం ప్రారంభించి ఆ ప్రాంతంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు.
ఈ ఆలయంలో కుల, మత బేధం మగ, ఆడ అనే తేడాలు లాంటివి ఉండవు. ఇక్కడికి ఎవరు అయినా వచ్చి నేరుగా అమ్మవారికి అభిషేకం చేయవచ్చు పూజారి అంటూ ఎవరు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఆడవారు ఎలాంటి సమయాల్లో అయినా ఆలయంలోకి రావొచ్చు. అందరిని సమానంగా చూడటానికి ఇదియే ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
ఇక ఈ ఆలయంలో శ్రీ బంగారు అడిగలర్ అనే గురువు ఈ అమ్మవారి గురించి భక్తులకు ఎన్నో విశేష బోధనలు చేస్తుంటారు. ఈ ఆలయంలో తీర్దానికి బదులుగా గంజిని ఇస్తారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.