దేవాలయాల నిలయం భారతదేశం. వెయ్యేళ్ల క్రితమే అనేక ఆలయాలు నిర్మించారు. వాటిలో అద్భుతమైన కొన్ని దేవాలయాల గురించి..
అంబరనాథ్ ఆలయం (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి చేరువలో అంబరనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 1060 ప్రాంతంలో షిలహర రాజు చిత్తారాజా నిర్మించారు.
బృహదీశ్వరాలయం (తంజావూరు)
తంజావూరు(తమిళనాడు) లో బృహదీశ్వరాలయం ఉంది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు అత్యంత అద్భుతంగా నిర్మించారు. గర్భాశయంలో ఉన్న శివలింగం పూర్తిగా నల్ల రాయితో చేయబడి అందరినీ ఆకర్షిస్తోంది.
శోరే దేవాలయం (మహాబలిపురం)
దక్షిణ భారతదేశంలోని పురాతన నిర్మాణ ఆలయాలలో ఇది కూడా ఒకటి. పల్లవ రాజు నరసింహవర్మ పాలనలో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలోని దేవుణ్ణి శౌరి రాజా పెరుమాళ్ అని పిలుస్తారు.
శ్రీ సోమనాథేశ్వరుడు (గుజరాత్)
మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాధ్ క్షేత్రం మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా అంటారు. ఈ ఆలయం 7 వ శతాబ్దంలో సీనా రాజవంశం వారు నిర్మించారు.
శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం (కర్ణాటక)
క్రీ.శ. 1268 లో హోయసల చక్రవర్తి మూడవ నరసింహుని ప్రధాన సైన్యాధికారి జక్కనాచార్యుడు చెన్నకేశవ ఆలయాన్ని నక్షత్రాకారంలో అబ్బురపరిచే శిల్ప సౌదర్యంతో నిర్మించారు.
కేదారనాథ్ ఆలయం
మందాకిని నది పైభాగాన మంచు కప్పిన కొండల మధ్య కేదారనాథ్ ఆలయం ఉంది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి.
శ్రీ ఆది కుంభేశ్వరాలయం (కుంభకోణం)
తమిళనాడులోని శివాలయాలలో శ్రీ ఆది కుంభేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. కావేరి నది అరసాలాల్ నదుల మధ్య ఈ క్షేత్రం ఉంది.
బ్రహ్మ దేవుని ఆలయం (పుష్కర్)
బ్రహ్మ దేవుని కి ఉన్న అతి తక్కువ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. సిందయరాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చెంద్ ఫరేఖ్ ఈ ఆలయాన్ని కట్టించారు.
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం)
తమిళనాడులోని కాంచీపురం అనే ప్రదేశంలో పెరుమాళ్ కోయిల్ ఉంది. చోళులు నిర్మించిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యాతిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
బాణా శంకరి ఆలయం (బాదామి)
కర్ణాటక రాష్ట్రంలో బాదామి అనే ప్రాంతంలో ఈ బాణా శంకరి(పార్వతిదేవి) ఆలయం ఉన్నది. ఈ ఆలయం మొదట చాళుక్యులు నిర్మించారు.
బద్రీనాథ్ క్షేత్రం (బదరీ)
గర్హ్వాల్ కొండలలో అలకనందా నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో బద్రీనాథ్ క్షేత్రం ఉంది. నర నారాయణ కొండల వరసల మధ్య నీలఖంఠ శిఖరానికి దిగువభాగంలో ఉంది. ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు.
లింగరాజ ఆలయం (భువనేశ్వర్)
ఒడిషాలోని భువనేశ్వర్లో లింగరాజ ఆలయం ఉంది. కళింగ శిల్పకళకు చెందిన ఒక విగ్రహం ఈ ఆలయంలో 6 వ శతాబ్దంలో నిర్మించబడింది.
విరూపాక్ష ఆలయం – హంపి
తుంగభద్ర నది ఒడ్డున హంపిలో ఉన్న విరూపాక్ష(శివుడు) దేవాలయం హంపిలోని దేవాలయాలలో అత్యంత పవిత్రమైంది. ఈ ఆలయం 7 వ శతాబ్దంలో నిర్మించారు.
ద్వారకాదీశ ఆలయం (ద్వారక)
ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలించిన పవిత్ర పురం ఇది. 2500 సంవత్సరాల వయసు ఇక్కడి ద్వారకాదీశ ఆలయానికి ఉంది.
శ్రీ రంగనాధ స్వామి ఆలయం (తిరుచురాపల్లి)
వైష్ణవ సంప్రదాయాలకు చెందినవారికి శ్రీ రంగనాధ స్వామి ఆలయం ప్రధానమైంది. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ఈ క్షేత్రం అతి పెద్దదిగా చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయ విస్తీర్ణం 156 ఎకరాలు.
మధుర మీనాక్షి ఆలయం (మధురై)
తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ మధుర మీనాక్షి ఆలయం ప్రస్తావించబడుతోంది.ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించారు.
ముండేశ్వరి ఆలయం (బీహార్)
ముండేశ్వరి కొండలలో ఉన్న ముండేశ్వరి మాత ఆలయం పరమశివుడు, శక్తి మాతకు చెందింది. భారత పురావస్తు శాఖ వారు ఈ ఆలయాన్ని క్రీ.శ. 108 కాలం నాటిదిగా పేర్కొన్నారు.1915 నుండి ఇది సంరక్షిత కట్టడంగా మారింది.
దుర్గాలయం (కర్ణాటక)
దుర్గ అంటే రక్షణ అని అర్ధం. ఈ ఆలయాన్ని 7 శతాబ్దంలో చాళక్యులు నిర్మించారు. ఈ ఆలయాన్ని శివునికి, విష్ణువుకి అంకితం చేశారు.
లాడ్ ఖాన్ ఆలయం (కర్ణాటక)
ఐహోళే లోని దుర్గా దేవాలయానికి దక్షిణాన ఉన్న ఈ శివాలయం చాళుక్యులు 5 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని లాడ్ ఖాన్ ఆలయం అని పిలుస్తారు, ఎందుకంటే దీనిని లాడ్ ఖాన్ అనే వ్యక్తి నివాసంగా ఉపయోగించారు.