మన దేశంలో ఎన్నో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉండగా అందులో అపురూపు శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానటువంటి మిస్టరీ ఆలయాలు, తాంత్రిక దేవాలయాలు ఉండగా, ఈ ఆలయం మాత్రం దయ్యాలని వదలగొట్టే ఏకైక హిందూదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రం, దౌసా జిల్లాలో, మెహందీపూర్ బాలాజీ ఆలయం ఉంది. బాలాజీ అంటే శ్రీవేంకటేశ్వరస్వామి అనుకుంటారు కానీ ఈ ఆలయంలో ప్రధానదైవం హనుమంతుడు. ఇక్కడ హనుమంతుడిని బాలాజీగా కొలుస్తున్నారు. ఈ ఆలయానికి దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలియుచున్నది. ఈ ఆలయ గర్భగుడిలో బాలుని రూపంలో హనుమంతుడు దర్శమిస్తుంటాడు. సాధారణంగా ఏ హిందూ దేవాలయం వెళ్లిన చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈ ఆలయం మాత్రం విపరీతమైన అరుపులతో ఆలయంలోకి వెళ్ళడానికే భయాన్ని కలిగించేలా ఉంటుంది. ఈ గుడి ఆవరణలో దయ్యాలు, దుష్ట శక్తులు పీడిస్తున్న బాధితులు కనిపిస్తుంటారు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం హనుమంతుడు ఒక భక్తుడికి బాలుని రూపంలో కనిపించి నేను ఫలానా చోట ఉన్నాను అక్కడికి వెళ్లి పూజించమని చెప్పాడట, కానీ ఆ భక్తుడు ఎక్కడ వెతికిన స్వామివారు కనిపించకపోవడంతో స్వామివారికోసం తపస్సు చేయగా, ఆ భక్తుడి కలలో స్వామివారు కనిపించి తానూ ఉన్నచోటు చెప్పాడట. ఆవిధంగా బాలునిరూపంలో వెలసిన హనుమంతుడితో పాటు ఇక్కడ శివుడి ఉగ్రరూపమైన భైరవుడి విగ్రహం, దుష్ట శక్తులకు రాజుగా భావించే పెతరాజు విగ్రహం భక్తులకి దర్శమిస్తున్నాయి.
పూర్వం ఒకసారి ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని పెకిలించాలి కొందరు దుండగులు ప్రయత్నించినా వారికీ ఆ విగ్రహం లోతు ఎంతకీ తెలియరాకపోవడంతో వారి ప్రయత్నాన్ని విరమించుకున్నారట. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, స్వామివారి పాదాల చెంత నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే భక్తులకి ప్రసాదంగా ఇస్తుంటారు. ఈ నీటిని మానసిక సమస్యలు ఉన్నవారికి తాగితే వారిలో మార్పు కచ్చితంగా వస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ఆలయంలో ఎప్పుడు విచిత్రంగా అరుస్తూ ఎప్పుడు జనాలతో ఆలయం అనేది నిండిపోయి ఉంటుంది. ఈ ఆలయంలో భూత వైద్యం అనేది చేస్తుంటారు. ఈవిధంగా హనుమమంతుడు బాలుని రూపంలో దర్శనమిస్తూ బాలాజీగా కొలిచే ఈ ఆలయం భూత వైద్యం చేసి దయ్యం పట్టినవారికి దయ్యాన్ని వదిలించే ఏకైక హిందూదేవాలయంగా చాలా ప్రసిద్ధిచెందింది.