బతుకమ్మని తొమ్మిది రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఆడవారు చేసుకునే ఈ బతుకమ్మ పండుగ లో ఒక్కో రోజు ఒక్కో విధంగా తొమ్మిది రూపాల బతుకమ్మ ఉంటుంది. మరి గౌరమ్మని పూజిస్తూ చేసుకునే ఈ బతుకమ్మ ఎలా వచ్చింది? బతుకమ్మ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం ఒకప్పుడు భూస్వాముల పాలన ఉన్నప్పుడు ఒక భూస్వామి ఆగడాలను భరించలేని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఊరిలో ఉన్న వారందరు కూడా కలకాలం బతుకమ్మ అంటూ దీవించగా అప్పుడు అలా బతుకమ్మ మొదలైంది. అప్పటినుండి ఆడవారు తమకు ఎలాంటి ఆపద రావొద్దు, భర్త, పిల్లలు అందరు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ గౌరమ్మని పూజిస్తూ సంతోషంగా చేసుకునే పండగే బతుకమ్మ.
ఇలా తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా చెబుతారు. అవి ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ , ఇక చివరి రోజు చేసుకునేదే సద్దుల బతుకమ్మ.
ఎంగిలిపూల బతుకమ్మ:
మొదటి రోజు జరుపుకునే పండగని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే, ఒక రోజు ముందుగానే పూలను తీసుకువచ్చి అవి విడిపోకుండా నీటిలో వేసి మరుసటి రోజు బతుకమ్మని పేరుస్తారు అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈరోజున గ్రామాల్లో ఆడవారు వాయనంగా తమలపాకులు, తులసి ఆకులూ ఇచ్చుకుంటారు.
అటుకుల బతుకమ్మ:
రెండవ రోజు జరుపుకునే అటుకుల బతుకమ్మ రోజున అటుకులు వాయనంగా పెడతారు. ఇక రెండు వరుసలలో గౌరమ్మని పేర్చి బతుకమ్మ ఆడుకుంటారు.
ముద్దపప్పు బతుకమ్మ:
మూడవ రోజు బతుకమ్మలో మూడంతరాల పూలను అందంగా పేర్చి పైన గౌరమ్మని పెడతారు. ఈ రోజున వాయనంగా సత్తుపిండి, చక్కర, బెల్లం, పేసర్లు కలిపి పెడతారు.
నానబియ్యం బతుకమ్మ:
ఈ రోజున నాలుగంతరాల బతుకమ్మని పేర్చి పైన గౌరమ్మని పెడతారు. ఈ రోజున నానబోసిన బియ్యంలో చక్కర కానీ బెల్లం కానీ కలిపి ముద్దలుగా చేసి పెడతారు.
ఈరోజున బతుకమ్మ చేయరు ఎందుకంటే పూర్వం ఒకసారి బతుకమ్మ చేస్తుంటే మాంసం తగిలి అపవిత్రం అయిందని ఈరోజున బతుకమ్మ ఆడారు.
వేపకాయల బతుకమ్మ:
ఈరోజున బతుకమ్మని ఏడంతరాలుగా పేరుస్తారు. వాయనంగా పిండితో చేసిన సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు.
వెన్నముద్దల బతుకమ్మ:
ఈరోజున ఎనిమిది అంతరాలుగా బతుకమని పేరుస్తారు. వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి పెడతారు.
సద్దుల బతుకమ్మ:
చివరి రోజు చేసుకునే బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈరోజున దొరికిన అన్ని రకాల పూలతో వీలైనంత పెద్దగా బతుకమ్మని తయారు చేసి చీకటి పడేవారికి ఆడవారు పాటలతో ఆనందంగా ఆడుకుంటారు.