Home Unknown facts శ్రీమహావిష్ణువు ఒంటికాలిపై కనిపించే ఆలయం!

శ్రీమహావిష్ణువు ఒంటికాలిపై కనిపించే ఆలయం!

0

విష్ణు మూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది
ఈ సనాతన భారత దేశంలో విష్ణుమూర్తి కి ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక విశిష్టత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

tirokkavalur vishnu templeఅదేవిధంగా ఆలయాలలోని విగ్రహాల ప్రతిష్ఠ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని దేవాలయాలలో విగ్రహాలు కూర్చొని భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ ఉంటారు. మరి కొన్ని దేవాలయాలలో విగ్రహాలు నిల్చొని ఉంటాయి. మరికొన్ని దేవాలయాలు శయనపై కొలువుదీరి ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.

కానీ ఎప్పుడైనా ఒంటికాలిపై దర్శనమిచ్చే విగ్రహాలను చూశారా? ఈ ఆలయంలోని స్వామి వారు ఒంటికాలిపై దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఆలయం ఎక్కడ ఉంది? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

తమిళనాడు రాష్ట్రంలో విలుప్పురం జిల్లాలో తిరుక్కోవల్లూర్ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది.
మన భారత దేశంలో అతి ముఖ్యమైన 108 విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి. దీనిని రెండు వేల సంవత్సరాల క్రితం పల్లవ రాజులు నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి ఒంటికాలిపై భక్తులకు దర్శనమిస్తాడు.

ఆ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే. విష్ణు భగవానుడు వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తిని మూడడుగుల స్థలం కావాలని కోరుతాడనే విషయం మనకు తెలిసిందే. అయితే మూడు అడుగులలో ఒక అడుగు ఆకాశం పై పెట్టగా, మరొక అడుగు భూమిపై పెడతాడు. ఇక మూడవ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పమని వామనుడు బలిచక్రవర్తిని అడగగా అప్పుడు బలి చక్రవర్తి నా తలపై పెట్టమని కోరుతాడు.

దీంతో వామన రూపంలో ఉన్న విష్ణుభగవానుడు బలి చక్రవర్తి తల పై కాలు మోపే సమయంలో విష్ణుమూర్తి వామనుడిని పాతాళంలోకి తొక్కిన తర్వాత ఈ ప్రదేశంలోనే విష్ణుభగవానుడు ఒంటికాలిపై భక్తులకు దర్శనమిస్తూ వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకోసమే ఇక్కడ అ విష్ణుభగవానుడు ఓకే కాలిపై నిలబడి భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు.

Exit mobile version