Home Unknown facts శివుడి భార్య అయిన సతీదేవీ ఉమా దేవి గా జన్మించిందా ?

శివుడి భార్య అయిన సతీదేవీ ఉమా దేవి గా జన్మించిందా ?

0

పూర్వం హిమవంతుడు అనే ఒక పర్వతరాజు వుండేవాడు. అతని భార్య మేన. అతనికి ఎంత ప్రయత్నించినా సంతానం కలుగలేదు. ఒకరోజు కశ్యప్రజాపతి వీరి ఇంటికి ఒక కార్యనిమిత్తం వస్తాడు. రాజు అతనికి మర్యాదలు చేసి ఇలా అంటాడు.. ‘‘ఓ మునీంద్రా! దేనివల్ల అక్షయపుణ్యలోకాలు కలుగుతాయి? దేనివల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి? దానికి సంబంధించిన విషయాలుఏంటో వివరించండి…’’ అంటూ కోరుకుంటాడు.

kashyapuduఅప్పుడు ఆ కశ్యపుడు.. ‘‘నాకు ఉత్తమ కుమారులు (దేవతలు) జన్మించడం వల్ల నాకు పుణ్యం, రాజయోగం , గౌరవం కలిగింది. నువ్వు కూడా తపంచేసి సంతానభాగ్యాన్ని పొందు’’ అని చెప్పి వెళ్లిపోతాడు.

అప్పుడు హిమవంతుడు బ్రహ్మకోసం తపం చేయగా.. బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు హిమవంతుడు ఉత్తమ సంతానం కావాలని కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మ ‘‘నీకు ఒక కొడుకు, కుమార్తెలు జన్మిస్తారు. ఆ కూతురివల్ల నువ్వు కీర్తిమంతుడివి అవుతాయి. ఆమె దేవలతో కూడా నమస్కరింపబడుతుంది’’ అని వరమిస్తాడు.

ఆనాడు యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకున్న శివుడి భార్య అయిన సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె ‘ఉమ’ అనే పేరుతో పిలువబడుతుండేది. ఆమె మహానుభావురాలు. ఆమె ఆత్మ కూడా మూడు విధాలుగా రూపొందించబడింది. అపర్ణ, ఏకపర్ణి, ఏకపాటలు ఆ ఆత్మల పేర్లు. అందులో అపర్ణయే ఉమ.

ఉమ శంకరుని విడిచివుండలేక మహాతపస్సు చేయడానికి బయలుదేరుతుండగా. తల్లి ఆమెను నివారించి ‘తపము వద్దు’ అని అంటుంది. కాని ఆమె నిశ్చయంగా చేయాల్సిందేనని చెప్పి.. తల్లి అనుమతి తీసుకుని వెళుతుంది. ఆమెతోపాటు ఏకపర్ణి, ఏకపాటలు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ ముగ్గురే లోకమాతలు. అలా తపస్సు చేసి శంకరుని వివాహం చేసుకొని అందరి చేత పూజింపబడుతుంది.

 

Exit mobile version