Home Unknown facts ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉందొ తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉందొ తెలుసా?

0

షిరిడి సాయిబాబాను హిందువులు, ముస్లింలు రెండు మతాల వారు పూజిస్తారు. ఎందుకంటే రెండు మతాల పద్ధతిలో అయన బోధనలు చేసాడు. సాయిబాబా యొక్క ముఖ్యమైన వాక్కు అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. సాధువు, యోగి అయినా ఈయనను హిందువులు శివుని అవతారంగా కొలుస్తుంటారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sai babaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా లో సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ 116 అడుగుల షిరిడి సాయిబాబా విగ్రహం భక్తులకి దర్శనం ఇస్తుంది. ఇక్కడి సాయిబాబా విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద సాయిబాబా విగ్రహంగా చెబుతారు. ఈ విగ్రహ నిర్మాణం 2000 సంవత్సరంలో మొదలవ్వగా విగ్రహ నిర్మాణం పూర్తవ్వడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. ఈ విగ్రహ బరువు సుమారుగా వెయ్యి టన్నులకు పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్థుల భజన మందిరం నిర్మించి దానిపైన సాయిబాబు కుర్చునట్లుగా నిర్మించారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారుగా 4 కోట్ల రూపాయలు వ్యయం అయిందట. ఇక ఈ ఆలయంలో ప్రతి గురువారం ఉదయం జరిగే సాయి పల్లకి  సేవకి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఇది ఇలా ఉంటె, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువై ఉన్న సాయిబాబా ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి కుల, మతం లేకుండా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా విజయవాడ కృష్ణలంకలోని భ్రమరాంబాపురంలో సాయిబాబా మందిరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన మొట్టమొదటి సాయిబాబా మందిరం ఇదేనని చెబుతారు. ఇక్కడ సాయిబాబా విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ బాబా విగ్రహం సిమెంట్ తో చేయబడింది.  ఈ ఆలయంలో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం సాయిబాబా కు పల్లకి సేవ జరుగుతుంది. ఇంకా గురుపూర్ణిమ రోజు బాబాకు అన్నాభిషేకం జరుగుతుంది. ఈ రోజున పేదలకి అన్నదానం కూడా జరుగుతుంది.

Exit mobile version