Home Unknown facts వేయి స్థంబాల ఆలయాన్ని పోలిన మరొక ఆలయం గురించి తెలుసా?

వేయి స్థంబాల ఆలయాన్ని పోలిన మరొక ఆలయం గురించి తెలుసా?

0

శివుడు కొలువై ఉన్న రుద్రేశ్వరాలయానికి అనుకోని విడిగా ఒక కల్యాణమండపం ఉంది. ఆ మండపంలో వేయి స్థంబాలు అనేవి ఉన్నాయి. అందువలన ఈ ఆలయానికి వేయి స్తంభాల గుడి అనే పేరు సార్ధకమైంది. అయితే కాకతీయ కాలం నాటి ఈ ఆలయాన్ని పోరిన మరొక ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1000 pillarsతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి నుండి కొంతదూరంలో ఉన్న కలబగుర్ అనే గ్రామంలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా పూజలను అందుకుంటున్నాడు. అయితే 11 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కాకతీయ రాజులూ కట్టించినట్లుగా తెలియుచున్నది. అయితే ఈ ఆలయంలో ఉన్న మండప నిర్మాణ శైలి వేయి స్తంభాల గుడి మండప నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయంతో పాటు శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం, శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం ఉంది. అందుకే ఈ ఆలయాన్ని త్రికూట ఆలయం అని అంటారు. అదేవిధంగా వేయి స్తంభాల గుడిలో ఉన్న గర్బగుడిని కూడా త్రికూటాలయం అని పిలుస్తారు.

ఇది ఇలా ఉంటె, అతి పురాతన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, స్థానికుల కథనం ప్రకారం, ఈ ఆలయం కాశీ నుండి ప్రవహిస్తున్న నీటి మీద నిర్మించబడినదిగా చెబుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ గర్భగుడిలో ఒక నిర్దిష్టమైన స్థలంలో ఒక నాణెం పడివేస్తే, నీటిలో నాణెం వేస్తె ఎలాంటి శబ్దం అయితే వస్తుందో అలాంటి శబ్దం ఇక్కడి గర్భగుడిలో వినిపిస్తుంది. అందుకే ఒకప్పుడు ప్రవహిస్తున్న నీటిమీద ఈ ఆలయాన్ని నిర్మించారని అందుకే ఇలాంటి శబ్దం వినిపిస్తుందని చెబుతుంటారు.

 ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ అతిపురాతన ఆలయానికి శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు.

 

Exit mobile version