Home Unknown facts స్త్రీలకు లక్ష్మి ప్రాప్తం కలగాలంటే ఇవి తప్పక పాటించాలి

స్త్రీలకు లక్ష్మి ప్రాప్తం కలగాలంటే ఇవి తప్పక పాటించాలి

0

స్త్రీలు ధరించే వాటిలో తలలో పూల నుండి కాలి మెట్టెల వరకు ప్రతీది వాళ్ళు చేసుకున్న పుణ్యం అని అంటారు. ఇల్లు కళకళలాడుతూ ఉంది అంటే ఆ ఇంట్లో ఆడవారు చేసిన పుణ్య కర్మలు అని చెప్పవచ్చు. వివాహానికి ముందు నుండే ఎన్నో పూజలు, వ్రతాలు చేసి ఎంతో పుణ్యం సంపాదించుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఆడవారు చేసుకున్న పుణ్యమంతా హరించుకుపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

Lakshmi deviవ్రతాల ద్వారా, పుణ్యాల ద్వారా, పతి సేవల ద్వారా, దానాల ద్వారా, ధర్మాకార్యాల ద్వారా, ఇంకా భర్త చేసిన పుణ్యాల వల్ల స్త్రీలకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల, భర్త, బిడ్డల ద్వారా మరియు లక్ష్మి ప్రాప్తం కూడా కలిగి సుఖాలు కలుగుతాయి.

ఎన్ని సత్ కార్యాలు చేసినా సుఖం లేదంటే పుణ్యం ఎప్పటికప్పుడు కరిగిపోతుందని అర్థం. దానికి కారణం రజోగుణం అయి ఉండవచ్చు. రజోగుణం అంటే ఆగ్రహం. కోపం వల్ల ఎంత పుణ్యం సంపాదించినా పుణ్యఫలమంతా తరిగిపోతుంది.

దు:ఖాలకూ, బాధలకూ కారణమవుతుంది. ఆ కోపం వల్లే విశ్వామిత్రుడు తన పుణ్యాన్ని మొత్తం అనేక వృధా కార్యాలకి వశిష్టుడు వంటి ఎందరో శాంతమూర్తులపై వినియోగించాల్సి వచ్చింది.

ఆవేశం అన్ని వేళలా తగదు. ఆవేశంతో పాటు అబద్దం చేసిన పుణ్యాన్ని హరించి వేస్తుంది. భర్త వద్ద అబద్ధాలు చెప్పడం ద్వారా చేసిన పుణ్యం మొత్తం కరిగిపోతుంది. భర్తకు చెప్పే అబద్దం ద్వారా చెయ్యబోయే పుణ్య కార్యాల పుణ్యం కూడా హరించుకుపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.

 

Exit mobile version