బెంగళూరుకు వెళ్తున్న రైలు, అందులోనూ భయంకరమైన రద్దీతో నిండి ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో ఒక పదమూడేళ్ళమ్మాయి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీ చెక్ చేస్తుండగా పట్టుబడింది. ఆ పిల్లను అనకూడని మాటలూ అని వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.
ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి గారు ఈ సన్నివేశాన్ని చూశారు.
“అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు నేనిస్తాను” అని అన్నారు సుధామూర్తి గారు
ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు, ఇవాళ మీరు ఇలా సాయం చేస్తే ఇదే వీళ్ళకి అలవాటు అయిపోతుంది అని టీసీ సుధామూర్తి గారితో వాదించాడు.
అయినా సుధామూర్తి గారు ఇవేమీ పట్టించుకోకుండా చిరునవ్వుతో ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చి, ఆ పిల్లను దగ్గరకి తీసుకొని ఎక్కడి నుంచి వస్తున్నావని,ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.
“అమ్మ చనిపోయాక నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు, నా సవతి తల్లి మా నాన్న బతికున్నత వరకు నన్ను బాగానే చూసుకుంది. ఈ మధ్య నాన్న చనిపోయారు అప్పటి నుంచి ఆమె నన్ను చిత్రహింసలు పెడుతుంది, అవి తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి ఈ రైల్ ఎక్కేశాన” అని ఆ అమ్మాయి చెప్పింది
సుధామూర్తి గారు ఆ అమ్మాయి చెప్పిన దానిని అంతా ఓపిక గా విన్నారు. ఇంతలోనే బెంగళూరు స్టేషన్ దగ్గర రైలు ఆగింది.
సుధామూర్తి గారు ఆ పిల్లని తనతో పాటు కార్ లు యెక్కించుకొని, దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పి ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.
ఆ అమ్మాయి అనాధశ్రమంలో చక్కగా చదువుకొని ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగం సాధించింది.
కన్నడ వాళ్ళు అమెరికా లో ఒక ప్రోగ్రాం కి సుధామూర్తి గారిని ఆహ్వానించారు. ఆ ప్రోగ్రోమ్ కోసం అమెరికా వెళ్ళిన సుధామూర్తి గారికి అవసరమైన పనులు అన్నిటిన్ని ఒక అమ్మాయి దగ్గర ఉంది చూసుకుంటున్నారు. ఆఖరికి సుధామూర్తి గారి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు ని కూడా ఈ అమ్మాయినే కట్టేశారు. ఇదే విషయం కౌంటర్ వాళ్ళు సుధామూర్తి గారికి చెప్పినప్పుడు
“ఎవరా అమ్మాయి? చెప్పగలరా? ” అని సుధామూర్తి గారు అడిగారు
ఇంతలో ఆ అమ్మాయే అక్కడికి రాగా, సుధామూర్తి గారు “మీరెందుకమ్మా నా బిల్లు కట్టారు” అని అడగ్గా
ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన క్షణం నుంచి ఇప్పుడు బిల్లు కట్టడం దాకా తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని సుధామూర్తి గారి కళ్ల ముందు వుంచి, ఆ పిల్ల తానేనని చెప్పింది.
ఆ పిల్లను చూసినా సుధామూర్తి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకున్నారు.