Home Unknown facts గంట ఆలయం ఎక్కడ ఉంది ? ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటో తెలుసా ?

గంట ఆలయం ఎక్కడ ఉంది ? ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటో తెలుసా ?

0

మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల నిర్మాణం, శిల్పకళా నైపుణ్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అదేవిధంగా ఈ ఆలయంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ గర్భగుడిలో, నంది విషయంలో, గర్భగుడిలో ఉన్న గంట విషయంలో ఇలా ఎన్నో రకాల విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

RamaLingeswara Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, సంతరావురు అనే గ్రామంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం గా చెబుతారు. ఈ ఆలయాన్ని చోళ రాజు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభువు అని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో రెండు నందులు ఉండగా, గర్భగుడిలో దేవుడికోసం వెలిగించిన దీపాన్ని ఈ రెండు నందులు కూడా చేసేవిధంగా ఆలయ నిర్మాణం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇది ఇలా ఉంటె, సాధారణంగా ప్రతి ఆలయంలో ఉన్న గంటని ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు సార్లు ప్రతిధ్వనిస్తుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం గంటని ఒకసారి మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఇంతటి విశిష్టత ఉన్న ఈ గంట నుండి ఓంకారం స్ఫష్టంగా వినిపిస్తోందని అక్కడి భక్తులు చెబుతారు. ఇలా కాశీలో విశ్వనాథుని ఆలయంలో ఉన్న గంటకి మరియు ఆ తరువాత ఈ ఆలయంలో నే ఇలాంటి ఓంకార శబ్దం రావడం విశేషం. ఇంకా ఈ ఆలయంలో గంగామాత విగ్రహాన్ని ఇద్దరు శిల్పులు చెక్కారని ఇక్కడి శిలాశాసనం పైన ఉంది.

ఇక ఈ ఊరిపేరు విషయానికి వస్తే, పూర్వం ఈ ఉరి పేరు రావూరు అని ఉండేది. ఇక్కడ ఉన్న కాలువ ద్వారా ఇతర ప్రాంతాల నుండి సరుకులు ఈ గ్రామానికి వచ్చేవి. ఇలా వారానికి ఒకసారి వేరే ప్రాంతం నుండి ఈ గ్రామానికి సరుకులు రావడం అప్పుడు సంత ఏర్పాటు చేయడంతో రావూరు కాస్త సంతరావురుగా మారిందని చెబుతారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న దేవాలయానికి చుట్టూ పక్కల ప్రాంతాల నుండి భక్తులు ఎక్కువగా తరలి వస్తుంటారు.

Exit mobile version