Home Unknown facts మృత్యు దోషాలు ఉన్న వారు ఇది తప్పకుండా తెలుసుకోవాలి!

మృత్యు దోషాలు ఉన్న వారు ఇది తప్పకుండా తెలుసుకోవాలి!

0

జాతకంలో మృత్యుదోషాలు, గండాలు ఉన్నాయని చెప్పడం మనం వింటూనే ఉంటాం. ఈ దోషాలు ఉన్న చాలామందికి తరుచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. దోషాలు తొలగించడానికి కొంతమంది పూజలు, వ్రతాలు అంటూ ఎప్పుడూ గుళ్ల చుట్టూ తిరుగుతుంటారు. ఒక్కోసారి ఎన్ని పూజలు పెద్దగా ఫలితం కనిపించక నిరాశ పడుతూ ఉంటారు. అయితే వీటన్నింటిని జయించి సంపూర్ణ ఆయుర్ధాయంతో జీవించడానికి సులభమైన మార్గం మన పురాణాల్లో ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మృత్యు దోషాలుమన జాతక చక్రం, దోషాలు అనేవి నక్షత్రాలపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అలా ఒక్కో నక్షత్రం ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైతే నక్షత్రాలతో రెండోదైన భరణీ నక్షత్రం రోజున శ్రీనివాసుడుని దర్శిస్తారో వారికి అకాల మృత్యు భయం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఎందుకంటే భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు. ఆ నక్షత్రం ఉన్నరోజు ప్రాతఃకాలంలో వేంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన అనుగ్రహం వల్ల యమగండాలు, దోషాలు పోతాయి. దీంతోపాటు భరణీ నక్షత్రం రోజు కుజుని ఆరాధిస్తే ఆర్థిక, ఆరోగ్య బాధలు పోతాయి.

అందుచేత భరణీ నక్షత్రం రోజున తప్పక ఆ కలియుగ దైవాన్ని దర్శించండి. ఒకవేళ తిరుమలకు వెళ్లడం వీలుకాకుంటే దగ్గర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి అపమృత్యు దోషాలు తొలగించుకోండి.

 

Exit mobile version