Home Unknown facts తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గారు గురించి ఆశ్చర్యకర నిజాలు

తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గారు గురించి ఆశ్చర్యకర నిజాలు

0

తిరుమల తిరుపతి ప్రపంచ ప్రసిద్ధ దేవాలయం. శ్రీ మహావిష్ణువు కలియియుగ దైవంగా కొలువై భక్తులకి దర్శనం ఇస్తున్న ఈ ఆలయానికి ప్రతి రోజు కొన్ని వేలమంది భక్తులు వస్తుంటారు. అయితే గర్భగుడిలో ఉన్న స్వామివారి దర్శనం అనేది సామాన్య భక్తుడికి కేవలం కొద్దిసేపే ఉంటుంది. కానీ ఆ వేంకటేశ్వరస్వామిని దగ్గరినుండి చూస్తూ దాదాపుగా 40 సంవత్సరాలుగా స్వామివారికి సేవ చేసే అదృష్టం కలిగినవారు తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గారు. ఇది ఇలా ఉంటె, చదువు విషయానికి వస్తే పి.హెచ్.డి చేసిన అయన అర్చకుడిగా ఎలా అయ్యాడు? సైన్స్, ఆధ్యాత్మికత గురించి ఏమని చెప్పారు? అయన ఆ వేంకటేశ్వరస్వామిని తాత అని ఎందుకు పిలుస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Pradhana Archakulu Ramana Dikshitulu

తిరుమల తిరుపతిలో అర్చకులుగా నాలుగు కుటుంబాలకి సంబంధించినవారు వంశపారంపర్యంగా సేవలను అందిస్తున్నారు. ఇలా రమణదీక్షితులు గారు చిన్నపటి నుండి వారి తండ్రి గారి దగ్గర తాత గారి దగ్గర ఆరాధన క్రమాలు అన్ని నేర్చుకున్నారు. అయితే గృహారాధనతో ప్రారంభం అయి ఒక వయసు వచ్చిన తరువాత ఆలయ అర్చనకు వెళ్తారు. ఇలా రమణదీక్షితులు గారు 1967 లో వచ్చారు. ఇక ఈయన మైక్రో బయోలజి లో పి.హెచ్.డి. చేసారు. అయితే ఎంత చదువుకున్న ఏ రంగాన్ని ఎంచుకున్న చివరకు చేరుకొనేది దివ్యమైన జ్ఞానం అని అయన చెబుతారు. ఇంకా మాలిక్యులర్ బయాలజీ లో పి.హెచ్.డి చేయించి నన్ను ఆ స్వామివారు తన దగగ్రికి ఎందుకు తీసుకున్నాడో అనే ప్రశ్న నాలో ఎప్పుడు ఉండేది. అయితే చాలా మంది ఇదే విషయం నన్ను అడిగినప్పుడు బహుశా శ్రీనివాసుడు ఒక శాస్త్రవేత్త పూజారి కావాలని భావించాడు ఏమో అని చెప్పేవాడంట. అయితే అర్చకుడిగా చేసే సమయంలో అక్కడికి వచ్చే వారి వృత్తి పరంగా ఒక్కో రంగంలో ఎక్స్ ట్రిమ్ కి వెళ్లినవారిని అంటే ఇంజనీర్, డాక్టర్, లాయర్, జడ్జి, పొలిటీషియన్ ఇలా వారందరిలో అయన గ్రహించింది ఏంటంటే, ఇదంతా కూడా భగవంతుడి దయ, నాది ఏం లేదు నేను ఒక నిమిత్తుడుని మాత్రమే అనే ఒక ఆలోచనలోకి వారు వస్తారు అని అంటారు.

ఆ వేంకటేశ్వరస్వామి యే తన గురువు గా రమణదీక్షితులు గారు భావిస్తారు, అయన అనుగ్రహంతో లివర్ మీద డాక్టరేట్ చేసారు. లివర్ రోగగ్రస్తులకి లివర్ ఫంక్షనింగ్ అనేది ఎలా మారుతుంది, దాన్ని తిరిగి మళ్ళీ నార్మల్ చేయడానికి ఏం చేయాలి అనే పరిశోధన చేసారు. అది కాకుండా మనం వాడే మందుల వలన మన శరీరం పైన ఎలాంటి మార్పులు ఉంటాయి, కొత్త మందులు ఎలా పనిచేస్తాయి, ఉదాహరణకి జలుబు వచ్చినపుడే వాడే యాంటీ ఎలర్జిక్ డ్రగ్ వలన నిద్ర వస్తుంది అని చెబుతుంటారు, అలా నిద్ర ఎందుకు వస్తుందనే వాటి పైన పరిశోధన చేసారు. ఇలా మెదడుకు వీటి వలన ఎందుకు నిద్ర వస్తుంది అనే విషయం పైన మాలిక్యులర్ లెవల్లో చేసిన పరిశోధనలు అమెరికన్ జర్నల్స్ లో పబ్లిష్ అయ్యాయి. ఇలా చాలా పరిశోధనలే చేశారు అందులో ఎక్కువగా లివర్ పైన పరిశోధనలు అనేవి చేసారు.

హిస్టరీ కనుక చూస్తే, న్యూటన్, మైకేల్ ఫారడే, ఆల్బర్ట్ ఐనస్టీన్ ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఒక కామన్ పాయింట్ ని అగ్రీ చేసారు. మనకన్నా మానవాతీతమైన ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే అభిప్రాయం వీళ్లందరికి కామన్ గా ఉంది. అంతేకాకుండా సైన్స్ ఇంకా ఆధ్యాత్మికత రెండు కూడా వేరు వేరు అని అయన ఎప్పుడు కూడా వేరుగా చూడరని చెబుతారు. ఎందుకంటే మనిషి దేనికోసం అయితే అన్వేషిస్తాడో దాన్ని సాధించడం ఆధ్యాత్మికతతో సాధించవచ్చు. అందుకే ఆధ్యాత్మికత కూడా సైన్స్, కాకపోతే హయ్యర్ లెవెల్ ఆఫ్ సైన్స్ గా అయన భావిస్తారట. అయితే మాములు ఆలోచన ఉన్నవారికి ఇది సాధ్యం కాదు. అందరిని కూడా ఆధ్యాత్మికత వైపు తీసుకువెళ్లి వారి మనసుని కొంచెం ట్రైన్ చేసి భగవంతుడి యొక్క విశ్వ వ్యాప్తితాన్ని అర్ధం చేసుకోవడమే దివ్యమైన జ్ఞానం. సరైన సాధన చేస్తే దీనిని ఎవరైనా సాధించుకోవచ్చు అయన చెబుతారు.

ఇంకా సైన్స్ లో మన కంటికి కనిపించని వాటిని చూడటానికి మైక్రో స్కోప్ వంటివి ఉంటాయి, అలానే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు, గెలాక్సీలు, వీటిని చూడటానికి అబుల్ టెలిస్కోప్ లాంటి ఇక్విప్ మెంట్స్ అవసరపడతాయో అలాగే మానవాతీత శక్తిని దర్శించడానికి, అర్థంచేసుకోవడానికి, అనుభవించడానికి కొన్ని సాధనాలు అవసరం అవుతాయి. సైన్స్ కి అయితే భౌతిక పరిమాణంలో అవసరం, ఆధ్యాత్మికతకు అయితే పారా భౌతికమైన పరిమాణంలో అవసరం. ఆగమశాస్రంలో ఉన్న దానిప్రకారం మన మనసుని, మన ఆత్మని, మన మేధస్సుని కలిపి ధ్యానం చేయగలితే దివ్యమైన జ్ఞానాన్ని పొందవచ్చు అని అయన చెబుతారు. ఇంకా తిరుమల దేవాలయంలో కులశేఖరపడి అనే మెట్టు ధాటి అర్చకులు తప్ప మరెవ్వరు కూడా రాకూడదు. కులశేఖరపడికి బయట ఉన్నది భౌతిక మైన ప్రపంచం అయితే కులశేఖరపడి లోపల మానవాతీత మైన ప్రపంచం అని అయన అంటారు.

భగవంతుడు గురించి అయన ఏమంటారంటే, విశ్వకర్త అయినా భగవంతుడు యోగులు తపశ్శక్తితో సామాన్య మానవులకి భగవంతుడు ఎలా ఉంటాడో చూపించాలంటే వారికి పరిచయమైనా రూపంలో చూపించాలి, అందుకే మానవ రూపంలో మానవాతీత శక్తులతో, అంటే స్వామివారికి చతుర్భుజాలు, శంఖు చక్రాలు, పీతాంబరాలు, కిరీటాలు పెట్టి ఇవ్వని కూడా మనవాతీతంగా మనిషికి ఒక ఆధ్బుతాన్ని కలిగించేలా స్వామివారిని సృష్టించి మహర్షులు మనుషులకి అందించారు. ఇలా భగవంతుడు ఉన్నాడని నమ్మించడం కోసమే విగ్రహ రూపంగా తీసుకువచ్చారు. శ్రీ మహావిష్ణువు అంటే పేరు కాదు అది ఒక లక్షణం, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని విష్ణువు అంటారు. భగవంతుడి యొక్క ఒక లక్షణమే విష్ణువు అని పురాణాల ప్రకారం పేరు అనేది వారి లక్షణాన్ని చూపిస్తుంది అని అయన చెబుతారు.

ఇక స్వామివారి గురించి చెబుతూ, అయన ఎప్పుడు అయినా స్వామిని వదిలి కొన్ని రోజులు వెళ్లాల్సి వస్తే ఆ స్వామివారి అనుమతి తోనే వెళ్లారు, వెళ్లే పని తొందరగా పూర్తవ్వాలని ప్రార్థన చేస్తారు. ఇక బంగారువాకిలి ధాటి స్వామివారిని చూసినప్పుడు అయ్యో వెళుతున్నావా అని శోకంగా స్వామివారు కనిపిస్తాడు అంట, మళ్ళీ అయన తిరిగి వచ్చిన తరువాత స్వామివారు సంతోషంగా కనిపిస్తారు అంట. ఇదంతా కూడా స్వామివారితో రోజు ఉండటం వలన స్వామివారి పైన ఉన్న అమితమైన ప్రేమవలన వీటిని నేను అనుభవిస్తాను అని అయన చెబుతారు. ఇది ఇలా ఉంటె, ఆ వేంకటేశ్వరస్వామిని రమణదీక్షితులు గారు తాత లాగా భావిస్తారు. తాత ని సంస్కృతంలో త్రాతా అని అంటారు. త్రాతా అంటే కాపాడేవాడు అని. అయితే తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం కంటే తాత మనవళ్ల మధ్య అనుబంధం తియ్యనిది. తండ్రి కొడుకుల మధ్య కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి కానీ తాత మనవడి మధ్య ఎలాంటి లిమిటేషన్స్ అనేవి ఉండవు. అందుకే ఆ స్వామివారిని నేను తాత అని పిలుచుకుంటాను అని అయన చెబుతారు.

ఆయన హాబీస్ ఏంటంటే పెయింటింగ్. ఇప్పటికి ఆయిల్ పెయింటింగ్ వేస్తుంటారని చెబుతారు. ఈ మధ్య పుస్తకాలను కూడా రాయడం ప్రారంభించారు. Sacred Foods of God అనే పుస్తకంలో స్వామివారికి జరిగే అర్చనలు, ప్రసాదంలో ఏ దినుసులు వేస్తారు, వాటి పోషక విలువలు ఏంటి, స్వామివారి నైవేద్యాలు ఏంటి ఏయే నైవేద్యం చేస్తారు? ఇలా స్వామివారి గురించి ఎన్నో విషయాలను అందులో వ్రాసారు. ఈ పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు లాంచ్ చేసారు.

ఇక కలియుగాంతం గురించి, కృతయుగంలో నాలుగు పాదాల మీద ధర్మం నడిచింది, తేత్రాయుగంలో మూడు పాదాల మీద, ద్వారపాయుగంలో రెండు పాదాల మీద, ప్రస్తుతం కలియుగంలో ధర్మం అనేది ఒక పాదం మీద నడుస్తుంది. కలియుగం అంతం ప్రళయం అప్పుడు ఆ ఒక్క కాలు కూడా విరిగి పోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తుంది. మహాభారతంలో అనుశాస పర్వంలో భీష్ముడు, ధర్మరాజుకి ద్వాపరయుగం ముగిసిన తర్వాత కలియుగం ఎలా ఉంటుంది అనేది వివరించాడు, ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రోడామస్ వారు వారి కాలజ్ఞానంలో కలియుగం గురించి కలియుగ అంతం గురించి వివరించారు. ఇంకా మతం గురించి ఏమన్నారు అంటే, మతం, కులం అనేది కేవలం దేహానికి సంబంధించింది. ఆత్మకి మతం, కులం అంటూ ఏమి ఉండదు అని అయన అంటారు.

ఇంకా గుడ్డిగా స్వామివారి ఆరాధనలు పూజ అనేది కేవలం ఒక మూఢనమ్మకంగా ఊరికే చేయకుండా, అందులోని అర్ధం, పరమార్థం, అంతరార్థం ఈ మూడింటిని కూడా అర్ధం చేసుకోవడానికి అయన ప్రయతిశ్నిస్తుంటారు. అందువల్ల ఎన్నో కొత్త విషయాలు ఆయనకి అనువభం అయ్యాయి అని, ఒక్కో అనుభవం విచిత్రంగా ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది అని ఆయన చెబుతారు. ఇంకా మన పంచేంద్రియాలకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను అని అయన చెబుతారు.

ఇలా తన జీవితాన్ని స్వామివారి సేవకి అంకితం చేసిన రమణదీక్షితులు గారు ఇప్పటికి కూడా నేను ఒక శాస్త్రవేత్త ని, ఆధ్యాత్మికత అనేది కూడా ఒక సైన్స్ అని అయన చెబుతారు.

Exit mobile version