Home Unknown facts నలుడు, దమయంతిలా ప్రేమ వివాహం ఎలా జరిగింది?

నలుడు, దమయంతిలా ప్రేమ వివాహం ఎలా జరిగింది?

0

మహాభారతంలో జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి బృహదశ్వుడు అనే ముని వచ్చినప్పుడు ధర్మరాజు ఆ మునితో కౌరవుల కారణంగా అన్ని కోల్పోయి ఇలా మేము ఇన్ని భాధలు భరిస్తున్నాం మాలానే ఇలా సర్వం కోల్పోయి జీవించేవారు ఉన్నారా అని అడుగగా అప్పుడు ఆ ముని ధర్మరాజా, నీకు అయినా నీ తమ్ములు తోడు ఉన్నారు కానీ మీలనే జూదం లో అన్ని కోల్పోయిన నలుడు అనే మహారాజు భార్యతో పాటు అడవులకి వెళ్లి ఎన్నో భాధలు పడ్డాడు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వారి కథని వివరించమని అడుగగా, నలదమయంతి ల కథని వారిని వివరించాడు. మరి నలుడు, దమయంతిలా ప్రేమ వివాహం ఎలా జరిగింది? నలుడు ఎందుకు అడవులకి వెళ్ళాడు? ఆ తరువాత వారిద్దరూ తిరిగి ఎలా కలిశారు? అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Love Story Of Nala Dhamayanthi

నిషిదదేశాన్ని పరిపాలించే రాజు నలుడు. విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు. ఈ రాజుకు చాలా కాలం సంతానం కలుగలేదు, అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఈ రాజుకి కూతురు జన్మించగా ఆమెకి దమయంతి అనే పేరు పెట్టుకున్నాడు. ఈమె అతిరూప సౌందర్యవతి, మంచి గుణవంతురాలు. అయితే ఆమె అందం, ఆమె వ్యక్తిత్వం గురించి విన్న నలుడు ఆమెపైన మనసు పారేసుకున్నాడు. అయితే ఒకరోజు నలుడు అడవిలో సంచరిస్తుండగా ఒక హంసల గుంపు అతడికి దగ్గరలో కనింపించగా ఆ రాజుకి ముచ్చట వేసి ఆ గుంపులో ఒక హంసని పట్టుకొని చూస్తుండగా మిగిలిన హంసలు వెళ్లిపోయాయి. అప్పుడు ఆ హంస, రాజా నన్ను విడిచిపెట్టు ని మనసులో దమయంతి ఉన్నదీ, నేను వెళ్లి నీ మనసులో మాటని, ని గురించి, ని ధీరత్వం గురించి చెబుతాను నన్ను విడిచిపెట్టు అనగా నలుడు సంతోషించి హంసని విడిచిపెట్టాడు.

రాజు కి ఇచ్చిన మాట ప్రకారం, హంస విదర్భ దేశానికి వెళ్లి రాణి కి నలుడు గురించి నలుడు మనసులో ఏముందో వివరించింది. అప్పుడు ముచ్చట పడిన దమయంతి నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అనగా ఇలా హంస ద్వారా ఇద్దరి ప్రేమాయణం జరిగింది. ఇద్దరికీ కూడా ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక దమయంతి తండ్రి ఆమెకి స్వయంవరం ప్రకటించడంతో నలుడు స్వయంవరానికి బయలుదేరాడు, మార్గమధ్యంలో ఇంద్రుడు వచ్చి రాజా నేను ఇంద్రుడను నాకు నీవు సహాయం చేయాలి అని అడుగగా, దానికి సరే అనే చెప్పడంతో, అప్పుడు ఇంద్రుడు, నీవు నాకు దూతగా వెళ్లి రాణి దమయంతి నన్ను వివాహం చేసుకునేలా నాగురించి వెళ్లి చెప్పాలి అనగా, అప్పుడు నలుడు, ఇది మీకు న్యాయమా నేను కూడా స్వయంవరానికే వెళుతున్న అనగా నీవు మాకు మాట ఇచ్చావు కనుక దైవకార్యం చేయాల్సిందే అనడంతో దేవదూతగా నలుడు దమయంతి అంతఃపురం లోకి వెళ్లి దమయంతిని మొదటి సారిగా చూసి ఎంతో ఆనందించి మనసుని కట్టడి చేసి రాణి నేను నలుడిని దేవదూతగా వచ్చాను అని ఇంద్రుడి గురించి వివరించగా, రాజా ఎప్పుడు అయితే హంస మొదటిసారి మీ గురించి చెప్పిందో అప్పుడే నా మనసుని మీకు ఇచ్చేసాను వివాహం నిను తప్ప ఇంకెవరిని నేను చేసుకోలేను అని కంట తడిపెట్టి స్వయంవరం లో అందరి దేవతలని ప్రార్ధించి మన వివాహానికి ఒప్పిస్తా అని చెప్పింది.

ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో స్వయంవరంలో నలుడు రూపంలో మరో నలుగురుని స్వయంవరానికి పంపగా, అప్పుడు దమయంతి మనసులో దేవతలని ప్రార్ధించగా అప్పుడు వారు తమ నిజ రూపంలోకి మారిపోయారు. ఇలా అప్పుడు నలుడికి దమయంతికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఇక దేవతలు తిరిగి వెళుతుండగా వారికి కలి పురుషుడు ఎదురవ్వగా, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించగా దమయంతి స్వయంవరానికి వెళుతున్నాను అని కలి చెప్పడంతో దేవతలు జరిగిన విషయం వివరిస్తారు. దీనితో పగ పెట్టుకున్న కలి వారిని విడిదీయాలని అనుకున్నాడు. కానీ ధర్మాత్ముడైన నలుడు ఎక్కడో ఒక చోట దొరకబోడు అని ఎదురుచూస్తుండగా ఆ సమయం రానే వచ్చింది. నలుడి సోదరునికి రాజ్యం పైన అధికారం చెలాయించాలనే ఆశ అతిగా ఉండేది, ఇక కలి నలుడిలో ప్రవేశించగా, మారువేషంలో వచ్చిన అతడు నలుడిని జూదం ఆడటానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టం, అందులో ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అని భావించి వెళ్లి జూదం అడగా తన రాజ్యం, సర్వసం అన్ని కోల్పోయాడు.

ఇలా అన్ని కోల్పోయిన అతడు దమయంతి తో నీవు నాతో ఈ సమయంలో ఉండటం వాడు నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పగా దానికి దమయంతి మీరు ఎక్కడ ఉంటె నేను అక్కడే ఉంటాను మీరే నా సర్వసం అని చెప్పడంతో అడవులలోకి బయలుదేరాడు. ఒకరోజు అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కష్టాలకి కారణం నేనే అని దిగులు చెందిన నలుడు నేను తనతో లేకుంటే తనకి ఈ కష్టాలు ఉండవు, తన పుట్టింటికి వెళుతుందని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నిద్రలేచిన దమయంతి నలుడు కనిపించకపోవడంతో దుఃఖిస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా కొందరు మునులు కనిపించి త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వస్తాడు ధైర్యంగా ఉండు అంటూ వెళ్లిపోగా, ఆమె అక్కడినుండి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.

ఇలా దమయంతిని విడిచి వెళ్లిన నలుడు అరణ్యంలో సంచరిస్తుండగా ఒకచోట అగ్ని చెలరేగి కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపిస్తాయి. అప్పుడు నలుడు ఆ అగ్నిలో చిక్కుకున్న నాగ కుమారుడిని రక్షించి బయటకి తీసుకురాగా, బయటపడిన ఆ పాము నలుడిని కాటువేయడంతో అతడి రూపం మొత్తం మారిపోతుంది. అప్పుడు ఆ పాము రాజా న పేరు కర్కోటకుడు, నీకు నా కాటువలన ఎలాంటి ప్రమాదం లేదు ఇలా మరువేషంలోనే ఉంటావు, ని పూర్వం రూపం, నీ భార్య, నీ రాజ్యం నీకు దక్కుతుంది దిగులు చెందకు, ఇక్కడికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉంది అక్కడికి వెళ్లి ఆ రాజుకి రథసారధిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం అనే విద్యని ఆ రాజుకు నేర్పించి అతడికి వచ్చిన అక్షహృదయం అనే విద్యని నేర్చుకోమని చెబుతాడు.

ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు ఆ రాజ్యానికి వెళ్లి రథసారధిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో వంటలు చేస్తూ ఉంటాడు. ఇక తన పుట్టింటికి చేరుకున్న దమయంతి భర్త గురించి ఆలోచిస్తూ ఏడుస్తుండగా, ఆమె తండ్రి నలుడి జాడని కనుక్కోమని చెప్పగా అప్పుడు దమయంతి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోకి వెళ్లిన ఆయన బయటకి వచ్చిన మారువేషంలో ఉంటాడు మీరు వెతికిన ఆయన్ని గుర్తుపట్టడం కష్టం అని రోదించగా, కొందరు నలుదిక్కులకు వెళ్లి వెతికి రాగ అందులో ఒకడు, అమ్మ ఒక రాజ్యంలో బాహుకుడు అనే వాడు తన భార్య కోసం దుఃఖిస్తున్నాడు అని చెప్పగా అతడే నలుడు అని చెప్పడానికి కూడా లేదు వికృత రూపంలో ఉన్నాడు అనగా, దమయంతి వెంటనే నాకు మళ్ళీ స్వయవరం ఏర్పాటు చేయండి ఇప్పుడే ఆ రాజ్యానికి కబురు పంపి వెంటను ఉదయం లోగ ఆ రాజుని రమ్మని కబురుపంపండి అనగా వారు అలానే ఆ రాజుకు కబురు పంపిస్తారు.

ఇక కబురు అందుకున్న ఆ రాజు నలుడిని పిలిచి మనం విదుర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి అక్కడి రాణి దమయంతి తన రెండవ స్వయంవరం ప్రకటించింది అని చెప్పడంతో, నలుడు మనసులో, నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగి పోయి కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అని దుఃఖిస్తూ అసలు ఏంటో వెళ్లి చూస్తే కానీ అర్ధం కాదని భావించి, రాజు ఆజ్ఞను పాటిస్తూ సరేనని రథాన్ని సిద్దము చేయగా, మనకి ఆ రాజ్యానికి చాలా దూరం మనం ఎలా అయినా వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పడంతో నలుడు రథాన్ని నడిపించాడు. ఇక భూలోకంలో సూర్యుని రథం లా దుకుపోయే శక్తి దేశం లో ఒక నలుడుకి మాత్రం మీ సొంతం. అలా బాహుకుడు అనే వేషంలో ఉన్న నలుడు రథాన్ని వేగంతో నడిపించాడు.

బాహుకుడి వేగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ రాజు తన చాతుర్యం కూడా అతడికి చూపించాలని భావించి రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటగానే బహుకా మన దాటివేసిన ఆ మహా వృక్షానికి ఎన్ని కాయలు, ఎన్ని ఆకులూ, ఎన్ని కొమ్మలు అనేది చెప్పగలవా అని అవి ఎన్ని ఉంటాయనేది ఆ రాజు చెప్పగా అతడి లెక్క నిజమో కాదని రథాన్ని అపి ఆ చెట్టుని నరికి అన్ని లెక్కించగా అప్పుడు బాహుకుడు ఆశ్చర్యంతో ఇది ఎలా సాధ్యం ఎలా చెప్పగలిగారు అనగా, ఇది అక్షవిద్య అనే సంఖ్య శాస్రం అని చెప్పగా, నాకూడా ఆ విద్యని చెప్పమని బాహుకుడు అడుగగా, ఆ రాజు ఆ విద్యని అతడికి నేర్పిస్తాడు. ఇందుకు బాహుకుడు ఆ రాజుకి అశ్వవిద్యని నేర్పిస్తాడు. ఇక అప్పటివరకు బాహుకుడిలో ఉన్న కలి అక్షవిద్య నేర్చుకోవడంతో క్షమించమని అతడి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు.

ఇక దమయంతి రాజ్యానికి చేరుకున్న వీరు అతిధి గృహంలో సేదతీరుతుండగా, వచ్చినది తన నలుడు అనే ఆనందం దమయంతిని వెంటఁడుతుంది కానీ అతడు వికృత రూపంలో ఉన్నాడని భావించి, తన చెలికత్తితో రాజు గారి రథసారధిని పిలిపించింది. అప్పుడు బాహుకుడు రావడంతో, నీవు నా భర్త నలుడు అనే విషయం నాకు అర్ధం అయింది. ఒక్క రోజులో నూరు యోజనుల దూరం నడుపగల సామర్థ్యం నా భర్తకి తప్ప మరెవ్వరికీ లేదు అనడంతో బాధతో అవును దేవి నేనే నలుడుని నీ భర్తని అని అంగీకరించాడు. నన్ను నట్టడివిలో వదిలేసి వెళ్ళిపోయావు అది ఎంతవరకు న్యాయం అని అడుగగా, నాకు అప్పుడు కలి ఆవహించి ఉన్నాడు, జూదంలో అన్ని కోల్పోయాను నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే కనీసం నీవైనా నీ ఇంట్లో సుఖంగా ఉంటావు కదా అనే అలా చేశాను అయినా నీవు రెండవసారి స్వయంవరం ప్రకటించవు నా మనసు గాయపరిచావు ఎందుకు అని అడుగగా, నేను నీవు ఎక్కడ ఉన్నవో తెలుసుకోవడానికే ఈ స్వయంవరం ప్రకటించాను అందుకే నూరు యోజనాల దూరంలో ఉన్నవారిని ఒక్క రాత్రిలో రావాల్సిందిగా షరతు పెట్టాను అలా రాగలిగే సామర్థ్యం నీకు తప్ప ఎవరికీ లేదనడంతో నలుడు కర్కటకుడిని తలుచుకోవడంతో వస్రం రాగ అది ధరించి మళ్ళీ తన రూపాన్ని పొందాడు. ఇలా ఇద్దరు కలసి తిరిగి నలుడి రాజ్యానికి వెళ్లి మళ్ళీ జూదం ఆడి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు.

ఈవిధంగా ఆ ముని నలుడి కథని ధర్మరాజుకి చెప్పి దిగులు చెందకు అని ధర్మరాజుకి అక్ష విద్యని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

Exit mobile version