Home Unknown facts శరీరంలో ఎనిమిది వంకరాలతో ఒక ఋషి ఎందుకు జన్మించాడో తెలుసా ?

శరీరంలో ఎనిమిది వంకరాలతో ఒక ఋషి ఎందుకు జన్మించాడో తెలుసా ?

0

అష్టా వక్రుడు అనేవాడు ఒక ఋషి. అష్ట అంటే ఎనిమిది, వక్ర అంటే వంకర అని అర్ధం. అంటే శరీరంలో ఎనిమిది వంకరలు ఉన్న వ్యక్తి కనుక ఈ ఋషికి అష్టా వక్రుడు అనే పేరు వచ్చింది. ఈ ఋషి గురించి మహాభారతంలోని అరణ్యపర్వంలో ఉంది. మరి ఈ ఋషి ఎవరు? ఎందుకు ఇలా జన్మించాడు? అష్టావక్ర గీత అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ashtavakara Gita

తేత్రాయుగంలో జనకుడు మిధిలను పాలిస్తున్న కాలంలో ఏకపాదుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయన ఒక వేదవేత్త. ఈ ముని ఉద్దాలకుడి చెల్లెలు అయినా సుజాతను వివాహం చేసుకున్నాడు. ఈ ముని తన శిష్యులకి విద్యా బుద్దులు నేర్పిస్తుండేవాడు. ఇలా ఆయన జీవితం సాగుతుండగా తన భార్య సుజాత గర్భవతి అయినది. ఇలా గర్భంలో ఉన్న శిశువు తన తండ్రి చెప్పే వేదాలను కడుపులో ఉంటూనే మననం చేసుకుంటుండేవాడు. ఒక రోజు కడుపులో ఉన్న ఆ శిశువు తన తండ్రి చెప్పే వేదాలను వింటూ ఒక సందర్భంలో తప్పుగా పలికావని గర్భంలో నుండి తన తండ్రికి చెప్పగా, అప్పుడు ఏకపాదుడు ఆగ్రహానికి గురై తన కొడుకు పుట్టకముందే తనని తప్పుపట్టాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో అష్టావక్రునిగా పుట్టమని శపిస్తాడు.

ఆ తరువాత కొన్ని రోజులకు ఏకపాదుని భార్య ఆశ్రమానికి అవసరమైన ధాన్యం నూనె తెమ్మని చెప్పగా, అప్పుడు ఏకపాదుడు జనక రాజు దగ్గరకి వెళ్లగా, ఆ సమయంలో అక్కడ ఒక పందెం జరుగుతుంటుంది. ఆ పందెం ఏంటంటే, వరుణుడి కుమారుడైన వందిని వాదంలో ఓడించినవారికి వారు కోరుకున్నది దక్కుతుందని, ఓడిపోతే జలంలో బంధించబడుతారని చెబుతారు. అయితే ఆ పందెంలో ఏకపాదుడు వందినితో ఓడిపోయి జలంలో బందీగా ఉండిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత సుజాత ఎనిమిది వంకరలు ఉన్న ఒక శిశువుకి జన్మిస్తుంది. దీంతో ఆ బాలునికి అష్టా వక్రుడు అనే పేరు పెడతారు. ఇలా జన్మించిన అష్టా వక్రుడు ఉద్దాలకుడి దగ్గర విద్యాబ్యాసం నేర్చుకునుంటాడు. తనకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి ద్వారా తన తండ్రి బందీగా ఉన్న విషయం తెలుసుకొని ఆ రాజు దగ్గరికి బయలుదేరుతాడు.

ఇలా తన తల్లి ఆశీస్సులు తీసుకొని, జలబంధీగా ఉన్న తన తండ్రిని విడిపించేందుకు జనకమహారాజు దగ్గరకి వెళ్లగా ద్వారపాలకులు లోపలి జ్ఞానులకే కానీ బాలురకు ప్రవేశం లేదని అడ్డుకుంటారు. అప్పుడు అష్టా వక్రుడు జ్ఞానికి వయసుతో సంబంధం లేదని అనేక శాస్త్రముల గురించి చెప్పి లోపాలకి వెళ్తాడు. జనకమహారాజు దగ్గరకి వెళ్లి వందితో వదిస్తానని చెప్పగా తన శాస్ర జ్ఞానాన్ని చూసి ఒప్పుకుంటాడు. ఇక అష్టా వక్రుడు కి వందితో అనేక విషయములపై వాదన జరుగుతుంది. చివరకు అష్టా వక్రుడు గెలుస్తాడు. అప్పుడు జనకమహారాజు అష్టా వక్రుడుని మహాజ్ఞాని అభినందించి ఎం కావాలో కోరుకోమనగా తన తండ్రిని విడిపించి వంధిని జలబంధీగా చేయమని కోరుకుంటాడు. ఇలా తన తండ్రిని విడిపించిన అష్టా వక్రుడు కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. ఇక ఏకనాధుడు తన కొడుకుని చూసి సంతోషించి నదిలో అష్టా వక్రుడు ని స్నానము చేయించి అష్టవంకరలు పోయేలా అనుగ్రహిస్తాడు.

ఇది ఇలా ఉంటె, గోపికల వృత్తానికి తన గత జన్మ రహస్య విషయానికి వస్తే, ఒకరోజు అష్టా వక్రుడు నదిలో ఉండగా అక్కడికి రంభాది అప్సరలు వచ్చి నృత్యం చేసి ఆనందపరుస్తారు. దాంతో ఏం కావాలో కోరుకోమనగా, విష్ణుమూర్తితోడి పొందుకోరారు. అప్పుడు విష్ణువు యొక్క కృష్ణవతారంలో మీరు గోపికలై ఆయన తోడు పొందుతారు అని వరాన్ని ఇస్తాడు. ఆలా తపస్సులో ఉండిపోయి ద్వారయుయుగంలో శ్రీకృష్ణుడి దర్శించి ఆయన పాదాల వద్ద మరణిస్తాడు. ఆలా మరణం తరువాత గోలోమునకు పోయి మోక్షాన్ని పొందుతాడు.

ఇక ఆయన పూర్వ జన్మ విషయానికి వస్తే, గత జన్మలో ఈయన దేవలుడు. మాళవతిని వివాహం చేసుకొని సంతానం పొంది విరాగై తపస్సు చేసుకొనుచుండగా తన తపస్సు నుండి వేడి పుట్టి ముల్లోకాలు బాధించసాగింది. అప్పుడు ఇంద్రుడు రంబని పంపి తపస్సు భగ్నం చేయమని చెప్పగా అతడు కొంచం కూడా చలించలేదు. దీంతో ఆగ్రహించిన రంభ వచ్చే జన్మలో అష్ట వంకరుడివై జన్మించు కాగా అని శపించి వెంటనే పశ్చత్తాపపడి శాపవిమోచనం కూడా చెప్పి స్వర్గానికి వెళుతుంది. ఆలా శాపానికి గురైన దేవేలుడే ఈ అష్టా వక్రుడు.

ఇక అష్ట వక్ర గీత విషయానికి వస్తే, వేదాంత పరంగా చాలా కీలకమైన అంశాలను ఈ గ్రంధం చర్చిస్తుంది. అయితే అష్టావక్రుడు జనకుడి చేసిన బోడాలనే అష్ట వక్ర గీత అని అంటారు. ఇందులో మొత్తం 20 అధ్యయాలు ఉంటాయి. ఇందులో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను కూడా ఈ అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది. అయితే రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎప్పుడు వెళ్లే నరేంద్రుడికి రామకృష్ణ పరమ హంస ఈ అష్టవక్ర గీత పుస్తకాన్ని ఇచ్చి కొన్ని శ్లోకాలను సంస్కృతం నుండి బెంగాలీ లోకి అనువందించమని చెప్పాడట. ఎందుకంటే ఈ శ్లోకాల కారణంగా అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుకి తెలుస్తుందని రామకృష్ణ పరమహంస భావన. ఈ విషయాన్ని స్వామి నిత్యస్వరూపానంద 1950లో రాసిన రామకృష్ణ పరమహంస చరిత్ర లో పేర్కొన్నారు.

Exit mobile version