Home Unknown facts చింతల వేంకటేశ్వర స్వామి చెట్టు తొర్రలో ఎందుకు వెలిశారో తెలుసా ?

చింతల వేంకటేశ్వర స్వామి చెట్టు తొర్రలో ఎందుకు వెలిశారో తెలుసా ?

0

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు పూజిస్తుంటారు. అది తిరుమల శ్రీవేంకటేశ్వరుడైనా, చిలుకూరిలోని బాలాజీ అయినా.. ఇలా మరే ఇతర ప్రదేశాలలోని దేవాలయామైనా కానీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది హిందువులకి. ప్రతి ప్రదేశంలోనూ శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. వాటిలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలోని చింతల వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. క్రీ.శ. 1460 – 1525 సంవత్సరాల మధ్యలో, విజయనగర కాలంలో నిర్మించినా ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరులను సైతం ఆకట్టుకుంటున్నది. మరి ఈ ఆలయ విశేషాలు, వెనుక వున్నా పురాణ గాధ మనం ఇపుడు తెలుసుకుందాం..

Chintala Venkataramana Swamyచింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఒకసారి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. దాంతో అక్కడి స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అలా చింత చెట్టు తొర్రలో నుండి విగ్రహం లభించడం వల్ల అప్పటి నుండి చింతల వేంకటరమణ స్వామిగా పిలుస్తున్నారు. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోట లో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కనబడి చింత చిట్ట తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

ప్రౌడరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510- 1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో వున్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాశి నుండి శిల్పులను రప్పించారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింతచెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, విగ్రహం చింతచెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళ నాథ స్వామి అని పిలిచే వారు. క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సినది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. ఆ తర్వాత చెప్పుకోవల్సినది ఆలయం నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండాల్సిల హంగులన్నీ ఉన్నాయి.. రథంలో నాలుగు అడుగుల గరుత్మండి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయం చుట్టూ, లోపల అపారమైన శిల్పసంపద ఉంది.

దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది.ఇది కూడా హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండటం విశేషం. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సినది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం. గర్భగుడిలోని మూల మూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది.

ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకటం విశేషం..

Exit mobile version