ఆధ్యాత్మిక మార్గాల కోసం సాధువులు, భైరాగులు తపస్సు చేస్తుంటారు. అయితే వేణుగోపాలస్వామి అనే అతను చిన్నతనం నుండి ఆధ్యాత్మికత పెరిగి ఎప్పుడు ఏకాంతంగా ధ్యానం చేసేవాడు. మరి ఆ వేణుగోపాలస్వామి దత్తాత్రేయస్వామి గా ఎలా అయ్యారు? ఆయనని పూజించే ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కందుకూరుకు కొంత దూరంలో మొగిలిచెర్ల అనే గ్రామంలో శ్రీ దత్తాత్రేయస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయం మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మాలకొండకు తపస్సు చేసుకుంటూ శేష తపస్సు సాగించేందుకు దత్తాత్రేయస్వామి ఈ గ్రామానికి వచ్చాడని చెబుతారు.
పూర్వం వేణుగోపాలస్వామి అనే అతడి చిన్న తనంలోనే మరణించగా వారు ఉదయగిరి అనే ప్రాంతానికి వలస వచ్చారు. ఇక ఆయనికి చిన్నతనం నుండి కూడా ఆధ్యాత్మిక ఎక్కువగా ఉండేది. ఇక ఎవడు ఎంత చెప్పినప్పటికీ చదువు పైన ఆసక్తి చూపెట్టేవాడు కాదు, అప్పుడు అతడి అన్నదమ్ములు చదువుకోవాలంటూ ఒత్తిడి చేయగా, తిరుపతి సమీపంలో ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇలా ఆ ఆశ్రమంలో ఉంటూ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు అన్ని కంఠస్తం చేసి తన ఉపన్యాసాలతో అందరిని ఆకర్షించేవాడు. అప్పుడు అయన గురువు అతడిని గురుపీఠాన్ని స్వీకరించాలని చెప్పగా అయన దాన్ని తిరస్కరించారు.
ఇక అక్కడి నుండి మాలకొండకి వచ్చి తీవ్ర తపస్సు ఆచరించి సిద్ద పురుషుడైయ్యాడు. అయితే వేణుగోపాలస్వామి శేష తపస్సు కోసం సరైన మార్గం కోసం అన్వేషిస్తుండగా మొగిలిచెర్ల గ్రామస్థులైన దంపతులు ఆయన్ని చూసారు. అపుడు అయన తన కోరికలను వ్రాసి ఆ దంపతులకి ఇవ్వగా వారు మొగిలిచెర్ల గ్రామానికి కొంత దూరంలో కొన్ని ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. అక్కడే ఆ దంపతులు ఒక ఆశ్రమాన్ని నిర్మించగా 1974 వ సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు దత్తాత్రేయస్వామిని ఆరాధించాడు.
ఇది ఇలా ఉంటె ఒకరోజు తాను దత్తాత్రేయ అవతారంగా మారుతున్నాని ఇప్పటినుండి నా నామం దత్తాత్రేయస్వామి అని వ్రాసి పెట్టి 1975 వ సంవత్సరంలో కపాల మోక్షం ద్వారా తనువు చాలించారు. అక్కడే ఆయన సమాధి నిర్మించబడింది. ఇక ఆ రోజు నుండి మొగిలిచెర్ల దివ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది.