Home Unknown facts రంగులు మార్చే వినాయకుని ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

రంగులు మార్చే వినాయకుని ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

రంగులు మారటం అనగానే అందరికి ఊసరవెల్లి గుర్తొస్తుంది.. లేదు మాటలు మార్చే మనిషి గుర్తొస్తాడు.. కానీ ఇక్కడ ఆలయంలోని వినాయకుడు తన రంగుని మారుస్తూ ఉంటాడు.. మరి ఈ అద్భుతం జరిగే ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలేంటి.. విజ్ఞనాయకుడు ఇలా రంగులు మార్చటం వెనుక కారణమేంటి మనం ఇపుడు తెల్సుకుందాం..

Ganapthiతమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఉంది ఈ అద్భుతమైన వినాయక దేవాలయం… అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినప్పటికీ, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.ఉత్తరాయణ కాలంలో అంటే మార్చి నుంచి జూన్ వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని ఇక్కడి భక్తుల విశ్వాసం.

అంతే కాదు, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు ఉండదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగానూ.. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో..,

ఈ బావిలో నీళ్లు నల్లగానూ ఉంటాయి. అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఇక్కడ ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి ధర్మం.. ఇది సహజంగా అందరికి తెల్సిన విషయమే… కానీ ఇక్కడ . ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. వినటానికి ఇదంతా అతిశయంగా ఉన్నా.. ఇది నిజం.. అందుకే ఈ ఆలయాన్ని అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు.. కొంతమంది మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా అంటారు..

ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ,ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా అంతే కాదు ఇక్కడి స్ధానికులు కూడా అదే చెప్తారు.వాస్తవానికి ఈ ఆలయం శివాలయం..ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందుగా శివాలయం ఉంటుంది.. దాని తరవాతే ఈ ఆలయం నిర్మించడం జరిగిందని,అందుకే ఈ ఆలయాన్నిశ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటాఋ.. ఈ ఆలయానికో చారిత్రకపర చరిత్ర కూడా ఉంది.అప్పటి కాలంలో కేరళపురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరంవెళ్లడం జరుగిందట. .అక్కడ రాజుగారు తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించిందట..

రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే.. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించిన,రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ, మరొక మరకత గణపతిని కూడా బహూకరించాడట. అప్పుడుకేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే అనంతరం జరిగిన తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబదగా.. ,ఈ గణపతి మాత్రం భక్తుల అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు.ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు.

ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తేవారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఇక్కడ స్థానికుల నమ్మకం..

Exit mobile version