Home Unknown facts శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఎక్కడ ఉందొ మీకు తెలుసా ?

శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఎక్కడ ఉందొ మీకు తెలుసా ?

0

శ్రీ కృష్ణుడు యాదవులను, గోవులను ప్రళయం నుండి కాపాడటం కోసం గోవర్ధన గిరి అనే పర్వతాన్ని తన చిటికెన వ్రేలితో ఎత్తి వారిని రక్షిస్తాడు. మరి శ్రీకృష్ణుడు ఎత్తిన ఆ గోవర్ధన గిరి ఎక్కడ ఉంది? ఆ క్షేత్రంలోని విశేషాలు ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం.

govardhanagiriఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధుర నుండి 30 కీ.మీ. దూరంలో గోవర్దనము అనే క్షేత్రం ఉంది. దీనిని వజ్రభూమిగా పిలుస్తారు. అయితే బ్రహ్మకు, కాళియునకు ఆనాడు స్వామి ప్రత్యేక్షమైన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇంకా యమునా నది తీరానగల ఈ క్షేత్రం శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గిరిధారిగా కీర్తించబడిన స్థలంగా ప్రసిద్ధి చెందినది.

ఇక పురాణానికి వస్తే, తర తరాలుగా గోపగోపికలు వజ్ర భూమిలో ఇంద్రిడిని ఆరాధించేవారు. కానీ శ్రీకృష్ణుడి ఆదేశానుసారంగా ఇంద్రుని వదలి తమను, తమ గోవులను సంరక్షిస్తున్న గోవర్ధన పర్వతాన్ని ఆరాదించగా, ఇంద్రుడు అందుకు కోపించి వజ్రభూమిలో రాళ్లవర్షాన్ని కురిపించగా శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని ఎత్తి వారందరిపైనా ఈ పర్వతాన్ని గొడుగులా నిల్చి కాపాడాడు.
ఇలా ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ మానసగంగ అనే సరస్సు ఉంది. ఈ సరస్సులో స్నానం చేస్తే గోహత్య దోషము పోతుందని చెబుతారు. ఇంకా భక్తులు 14 మైళ్ళు ఉన్న ఈ గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేయుదురు. అలాచేయలేని వారు మానసగంగా సరస్సుకి ప్రదక్షిణ చేస్తారు.

ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుడే స్వయముగా నిర్మించినట్లు చెప్పబడుచున్న బ్రహ్మకుండంలో స్నానం చేసి గోవర్ధనాలయాన్ని భక్తులు దర్శిస్తారు. ఈ మందిరంలో గోవర్ధన శిఖరం ఉన్నది. దానివెనుక వైపు గోవర్ధనాధుడు శిల్పరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అయితే బాగా పరిశీలించి చూస్తే ఆ శిల్పంపై నెమలిపింఛము అధ్బుతంగా కనిపిస్తుంది.

గోవర్ధన గిరి ప్రదక్షణ విషయానికి వస్తే, గోవర్ధన గిరి ప్రదక్షణ సుమారు 200 కి.మీ. ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసం నుండి కార్తీకమాసం వరకు భక్తులు సమూహంగా వస్తారు. అందులో రామదళం అనే భక్తసమాజం చాలా ముఖ్యమైనది. ఇందులో పురుషులైనా సాధువులు ఎక్కువగా ఉంటారు. వీరు 16 రోజులలో ఈ గోవర్ధన గిరి ప్రదక్షణ చేస్తారు. ఇక రెండవ దళం లో గృహస్థులు ఉండే వల్లభక్తుల గోస్వాములది. వీరు ఫాల్గుణ మాసములో ఒక యాత్ర చేస్తారు.

ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో గోవర్ధన గిరి ప్రదక్షణ యాత్ర అంతటిని కూడా సంకీర్తన నామజపంతో పాదచారులుగానే చేయుదురు.

Exit mobile version