Home Unknown facts ఆశ్చర్యాన్ని కలిగించే 15 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన హంగింగ్ టెంపుల్

ఆశ్చర్యాన్ని కలిగించే 15 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన హంగింగ్ టెంపుల్

0

ప్రపంచం మొత్తం లో ఇలా గాలిలో వేలాడే దేవాలయం ఇదేనని చెప్పవచ్చు. దీనినే హంగింగ్ టెంపుల్ అని పిలుస్తుంటారు. దాదాపుగా 15 వందల సంవచ్చారాల క్రితమే ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలోనే ఇలా గాలిలో వేలాడుతున్నట్లు ఆలయాన్ని ఎలా నిర్మించారనే విషయం అక్కడికి వచ్చే ప్రతి పర్యాటకున్నిఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇక్కడ ఈ ఆలయాన్ని ఇలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఎలా నిర్మించారు? ఈ ఆలయ కట్టడం వెనుక ఉన్న పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hanging Temple

చైనాలోని షాంక్సి ప్రాంతంలో ఉన్న హెంగ్ అనే కొండపై ఉందీ ఈ వేలాడే దేవాలయం. దాదాపుగా భూమికి 75 మీటర్ల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దూరం నుంచి చూస్తే గాల్లో తేలియాడుతున్నట్లుగా ఉంటుంది. అందుకే ఈ నిర్మాణానికి హ్యాంగింగ్ టెంపుల్ అని పేరొచ్చింది. బౌద్ధమతం బాగా ఆదరణ పొందిన సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

చైనా పురాణాల ప్రకారం, ఉత్తర వెయి కి రాజ వంశానికి ముఖ్య సలహా దారునిగా ఉండే లియా ఒరాణ్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం మొదలయింది. ఈ ఆలయ నిర్మాణానికి కొన్ని రోజుల ముందు ఒకరోజు చైనా రాజుల సమావేశంలో ఒక రాజు, మనం దేవుడు ఎక్కడ అంటే గాల్లోకి చూస్తాం. కానీ మనం నేల మీద ఆలయాలను కట్టుకొని ఆ దేవుడిని మనముందు నిలుపుకొని ప్రార్థిస్తున్నాం. ఇదేమి దైవారాధన అని వ్యంగంగా ప్రశ్నించగా, లియా ఒరాణ్ అందులో ఉన్న నిజాన్ని గ్రహించి మీరు అడిగిన ప్రశ్నకి త్వరలోనే జవాబు దొరుకుతుంది అని సభలో ఆ రాజుకి సమాధానం ఇచ్చాడట. ఇక లియా ఒరాణ్ ఎలాంటి సమాధానం ఇస్తాడో అని అందరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుండగా, ఒక కాగితంపైనా ఒక బిల్డింగ్ ప్లాన్ ని గీసుకు వచ్చి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే అంటూ రాజుకి ఆ ప్లాన్ ని చూపించడంతో, అది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారంట.

ఆ సభలో ఉన్న కొందరు మేధావులు, రాజులూ గాలిలో వేలాడే దేవాలయమా? అసలు ఇది సాధ్యం అయ్యే పనేనా అంటూ ఎదురు ప్రశ్నించడంతో, అప్పుడు లియా ఒరాణ్ గారు మీరు ఈ ఆలయానికి ఖర్చు అయ్యే నిధులు ఇవ్వండి చాలు దీనిని సాధ్యం చేసి మీ కళ్ళముందు ఉంచుతాను అని చెప్పడంతో, ఆ రాజు సరే నిధులు సమకూరుస్తాం ఒకవేళ నీవు ఈ ఆలయాన్ని నిర్మించడం కుదరకపోయిన, కట్టిన ఆలయం కూలిపోవడం లాంటివి జరిగిన మీకు మరణ శిక్ష విధిస్తాను అని చెప్పి ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధులను ఆ రాజు కేటాయించాడు.

ఇక లియా ఒరాణ్, వేల మంది పనివారితో కలసి నిర్మాణం మొదలుపెట్టగా మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని వాటిని లెక్కచేయకుండా ఎంతో శ్రమించి చివరకు ఈ ఆలయాన్ని ఎంతో ఆధ్బుతంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒకవైపు రాళ్ల సహాయం, మరోవైపు కర్రల సహాయంతో నిర్మాణం చేశారు. పొడవాటి కర్రలను ఒకవైపు సపోర్టుగా తీసుకుని నిర్మాణం చేశారు. వందల ఏళ్లు గడిచినా ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. మొత్తం ఆలయ విస్తీర్ణం 152 చదరపు మీటర్లు. 40 గదులు, కారిడార్లు, బ్రిడ్జ్లు, బోర్డ్ వాక్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.

ఆలయం లోపల రాజవంశస్థుల కంచు విగ్రహాలు, మట్టి శిల్పాలు, రాతి విగ్రహాలు చూడొచ్చు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు. వర్షం, మంచు నుంచి కొండ కాపాడుతూ ఉంటుంది. ఈ ఆలయం ప్రసిద్ధ చారిత్రకప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ సందర్శన కోసం పర్యాటకులు విశేషంగా తరలి వస్తుంటారు

Exit mobile version