Home Unknown facts దేశంలోనే అతిపెద్ద 10 హనుమంతుడి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

దేశంలోనే అతిపెద్ద 10 హనుమంతుడి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

0

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. అయితే మన దేశంలో ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. ఇక దేశంలో అనేక ఆంజనేయస్వామి విగ్రహాలు ఉండగా అందులో దేశంలోనే అతి పెద్ద ఆంజనేయుడి విగ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా:

Top 10 tallest Hanuman idol in Indiaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా లోని నర్సన్నపేట మండలంలో దేశంలోనే అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 176 అడుగులు.

ఆంధ్రప్రదేశ్, విజయవాడ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దేశంలోనే రెండవ అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 135 అడుగులు. ఈ స్వామిని వీర అభయ ఆంజనేయస్వామి అని పిలుస్తారు. పూర్తిగా వైట్ మార్బుల్ తో తయారుచేసిన ఈ విగ్రహాన్ని 2003 లో ప్రతిష్టించారు.

సిమ్లా:

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో జాకు హిల్స్ లో దేశంలోనే మూడవ అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. దాదాపుగా కోటిన్నర ఖర్చుతో నిర్మించిన ఈ విగ్రహం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుంది. 2010 లో నవంబర్ నాలుగు తేదీన హనుమాన్ జయంతి రోజున ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

ఢిల్లీ:

ఢిల్లీ లో శ్రీ శంకత్ మోచన్ అని పిలువబడే ఆంజనేయస్వామి విగ్రహం 108 అడుగుల ఎత్తు ఉంటుంది. ఢిల్లీకి ఈ విగ్రహాన్ని ఒక చిహ్నంగా భావిస్తారు. ఇక్కడి ఆంజనేయస్వామి విగ్రహం ఆంజనేయుడు తన ఛాతీని చీల్చుకోగా ఛాతి లోపల సీతారాములు ఉన్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఇక్కడ ఉన్న ఆలయం ఒకటిగా చెబుతారు.

మహారాష్ట్ర:

మహారాష్ట్రలోని నందురా బుల్దానా లో 105 అడుగుల ఎత్తు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే ఐదవ అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం అని చెబుతారు.

ఉత్తరప్రదేశ్:

ఉత్తరప్రదేశ్ లో ని షాజాన్పూర్ జిల్లాలో 104 అడుగుల ఎత్తు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.

ఢిల్లీ:

ఇక దేశంలోనే ఏడవ అతిపెద్ద విగ్రహం ఢిల్లీ లోని చట్టర్పూర్ ఆలయంలో 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.

అమృత్సర్:

దేశంలోనే ఎనిమిదవ అతిపెద్ద విగ్రహం అమృత్సర్ లోని రామతీర్ద్ అనే ఆలయం వద్ద 80 అడుగుల ఎత్తు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.

ఒరిస్సా:

ఒరిస్సా రాష్ట్రంలోని హనుమాన్ వాటికలో తొమ్మిదవ అతిపెద్ద విగ్రహం ఉంది.

పుట్టపర్తి:

పుట్టపర్తిలోని ఆంజనేయస్వామి విగ్రహం దేశంలో పదవ అతిపెద్ద విగ్రహం అని చెబుతారు

Exit mobile version