Home Unknown facts గంగ, యమునా నదులోనుండి వచ్చే నీరు రెండు నందుల నోటి నుండి నిరంతరం వచ్చే అద్భుతం

గంగ, యమునా నదులోనుండి వచ్చే నీరు రెండు నందుల నోటి నుండి నిరంతరం వచ్చే అద్భుతం

0

ఇక్కడ ఆలయ విశేషం ఏంటంటే స్వామి వారు గోవు రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. ఇక్కడే అర్థనారీశ్వర ఆలయం, చంద్రశేఖర మహాదేవ ఆలయం అను రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gupthakaashiగౌరీకుండ్ నుండి 34 కి.మీ. కేదారనాధ్ నుండి 48 కి.మీ. దూరంలో ఈ గుప్తకాశీ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి సిద్దేశ్వరమహదేవునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయ వెనుక భాగంలో గంగ, యమునా నదుల నీటిపాయ ఉన్నది. ఈ నీటిని తీసుకొనే స్వామిని అభిషేకించాలి. పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉన్నది.

ఈ ఆలయం ముందుభాగంలో, చదరంగా ఉన్న ఒక కుండం ఉన్నది. ఆలయం ముందు నుంచి, కుండలోనికి అయిదారు మెట్లు, ఈ మెట్లను అనుకోని, రెండు పక్కల గట్టుమీద, రెండు నందులు ఉన్నాయి. ఈ రెండు నందుల నోటి నుండి నీటిధార నిరంతరం క్రిందనున్న కుండలోనికి బాగా వేగంగా పడుతూ ఉంటుంది. ఈ రెండు దారాలలోని నీరు, సాక్షాత్తు గంగ, యమునా నదులోనుండి వచ్చినవే అని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.

ఇక ఆలయంలోపల ఉన్న స్వామి అర్ధనారీశ్వరుడు. ఈయన రూపం సగభాగమే శివుడు అని, మిగిలిన సగభాగం పార్వతి అమ్మవారి ప్రతీక అని స్థల పురాణం మనకు వివరిస్తుంది. అందువల్ల ఇక్కడ ఆలయం చుట్టూ చేసే ప్రదిక్షణ ఇక్కడ చేయకూడదని, ఆలయం ముందు నుండి ఎడమవైపుగా, ఆలయం వెనుకవైపు వరకు మాత్రమే వెళ్లి మరల వెనుకకు తిరిగి రావాలని చెబుతారు.

ఇలా చంద్రశేఖర మహాదేవ ఆలయంలోని స్వామి సాక్షాత్తు కాశీలోని విశ్వేశ్వరుడే అని ఇక్కడ భక్తుల నమ్మకం.

Exit mobile version