Home Unknown facts చేతబడులు సైతం తిప్పికొట్టే ప్రత్యంగిరా దేవి అవతార విశేషాలు

చేతబడులు సైతం తిప్పికొట్టే ప్రత్యంగిరా దేవి అవతార విశేషాలు

0

శక్తి రూపమైన అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు. మానవులకు ఆపద వచ్చినప్పుడు ఎలా ఐతే దేవుడు వేర్వేరు అవతారాలలో ఆడుకుంటాడో.. అమ్మవారు కూడా అలానే భక్తుడి పరిస్థితిని బట్టి ఒకోసారి శాంతమూర్తిగా అవతరిస్తే, మరోసారి ఉగ్రరూపంలో అవతరిస్తుంది.. అలా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారే ప్రత్యంగిరా దేవి.. మరి అమ్మ వారి అవతార విశేషాలేంటో మనం ఇపుడు తెల్సుకుండా..

Pratyangira Deviపూర్వం హిరణ్యకశిపుడిని వధించేందుకు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారమెత్తిన విషయం తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారకపోవటంతో, శివుడు శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి… ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు కూడా శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే అమ్మవారిని ప్రత్యంగిరా దేవి అని పిలుస్టారు.

ప్రత్యంగిరా అంటే ఎదురు తిరగటం.. ఎవరైనా మనకి హాని తలపెడితే, తిరిగి వారికే హాని తలపెడుతుంది కాబట్టి ఈ అమ్మవారికి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు భయంతో ఉన్నవారు, చేతబడి ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా ఇక వారి మీద పనిచేయకుండా అనుగ్రహిస్తుంది.. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. రావణాసురుడి కొడుకు అయినా ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. అపుడు సాక్షాత్తు హనుమంతుడే ఆ హోమాన్ని ఆపేందుకు వచ్చినట్లు పురాణ కథనం… కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చిలాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. అయితే హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు కనీసం చుట్టుపక్కల వారికి కూడా తెలియకపోవడం విశేషం..

ప్రత్యంగిరా మాతను అమ్మవారి సప్తమాతృక అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా కొలుస్తారు.. అందుకే అమ్మవారిని అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు… ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి.

ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ప్రత్యంగిరాదేవిని పూజించాలి.

 

Exit mobile version