Home Unknown facts శకటాసురుడు శ్రీకృష్ణుడి చేతిలోనే ఎందుకు మరణించాడు?

శకటాసురుడు శ్రీకృష్ణుడి చేతిలోనే ఎందుకు మరణించాడు?

0

శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటి. కృష్ణుడు చిన్నతనం నుండి చూపించిన లీలలు ఎన్నో ఉన్నాయి. మరి చిన్ని కృష్ణుడు శకటాసురుడిని ఎందుకు సంహరించాడు? ఆ రాక్షసుడికి ఉన్న శాపం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Krishnaపూర్వం హిరణ్యలోచనుడి కుమారుడు ఉత్కచుడు. ఇతడు చాలా భయంకర రాక్షసుడు. ఒక రోజు లోమశ మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి ఈ రాక్షసుడు చెట్లను అన్నిటిని వేర్లతో సహా పికి పడేయడంతో ఇది చుసిన లోమశ మహర్షి ఆగ్రహం చెంది నీవు పాము కుబుసం విడిచిపెట్టినట్లు నీవు నీ శరీరాన్ని వదిపెడతావు అంటూ శపిస్తాడు. దీంతో గర్వం అణిగిన ఆ రాక్షసుడు తప్పు తెలుసుకొని క్షమించమని ఆ మునిని ప్రార్ధించగా అప్పుడు ఆ ముని వచ్చే జన్మలో జకటాసురుడిగా జన్మిస్తావు, అప్పుడు శ్రీమహావిష్ణువు పాద స్పర్శతో శాపం తొలగిపోతుందని చెబుతాడు.

ఈ విధంగా మరు జన్మలో జకటాసురుడిగా జన్మించిన అతడిని కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించమని ఆదేశిస్తాడు. అప్పుడు కంసుడి ఆజ్ఞతో గోకులంలోకి ప్రవేశించిన జకటాసురుడు బాలుని రూపంలో ఊయలలో ఆడుకుంటున్న శ్రీకృష్ణుడి పైన బండిని తోస్తాడు. అప్పుడు చిన్ని క్రిష్నయ్య తన కాలితో ఆ బండిని ఒక తన్ను తన్నడంతో ఆ బండి వెళ్లి జకటాసురుడికి తగిలి మరణిస్తాడు. ఇలా పూర్వం జనంలో శాపానికి గురైన ఆ రాక్షసుడు ఈ జన్మలో శ్రీకృష్ణుడి చేతిలో మరణించి మోక్షాన్ని పొంది వైకుంఠానికి చేరుకుంటాడు.

Exit mobile version