Home Unknown facts శ్రీశైలంలోని ఘంఠ మఠం ఆలయంలోని ఆశ్చర్యకర రహస్యాలు

శ్రీశైలంలోని ఘంఠ మఠం ఆలయంలోని ఆశ్చర్యకర రహస్యాలు

0

పరమశివుడి యొక్క జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తి పీఠం ఒకే దగ్గర వెలసిన అద్భుత క్షేత్రం శ్రీశైలం. మన తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తరువాత అంతటి ఆదరణ ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం. దట్టమైన అరణ్యంలో ఎత్తైన కొండ ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రంలో ఎన్నో ఆశ్చర్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటివరకు మనలో చాలామందికి శ్రీశైలం లో మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవాలయాలకు వాయువ్య భాగాన ఘంఠ మఠం అనే ఆలయం ఉంది. మరి ఈ ఆలయ పురాణం ఏంటి? ఇక్కడ ఉన్న గంటకి ప్రాముఖ్యత ఏంటి? ఎక్కడలేని విధంగా ఇక్కడ ఎందుకు ఆశ్చర్యకర విగ్రహాలు ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Srisailam Gantamatham

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా లో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు, సముద్రమట్టానికి దాదాపుగా 458 మీ. ఎత్తున్న కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జునస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మల్లికార్జునస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈవిధంగా జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం.

దట్టమైన అరణ్యంలో కొండ పైన వెలసిన ఈ అతిపురాతన ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఇక్కడి ఆశ్చర్యాన్ని కలిగించే ఘంఠ మఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడి మహత్యం గురించి తెలిసినవారు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇక్కడ ఆణువణువూ ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

ఘంఠ మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం, పూర్వం ఘంటా కర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా ఘంటలని ప్రతిష్టించారు. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చే ఘంటా కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు.

ఇక్కడ ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడు ఉంటుంది. పూర్వం ఒకరు ఆ గుంట నుండి నీరు తీసుకువచ్చి ఆలయంలో ఉన్న సిద్దేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు ఘంటను మ్రోగిస్తూ ఉండాలి. ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా ఘంటను మ్రోగిస్తూ సిద్దేశ్వర లింగాన్ని అభిషేకించినవారికి ఆకాశగమనం అనే విద్య లభిస్తుందని అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్టసిద్దులలో ఒకటైన గగనయాన సిద్ది కలుగుతుందని పురాణం.

ఇలా ఇక్కడ నిత్యం గుంటలో నీరు ఉండటం వెనుక కారణం ఏంటంటే, ఒకప్పుడు ఉన్న సరస్వతి నది ఇప్పుడు అంతర్వాహినిగా ఉందని, శ్రీశైలం లోని ఘంటమఠంలో తన ఉనికిని ఇలా చిన్న ఊట భావి రూపంలో చూపిస్తుందని కొందరు నమ్ముతారు.

ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవతారూపం ఉండగా, ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది.

ఇక్కడ సిద్ది, మోక్షం, పూర్వ జన్మరాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది సిద్ది పొందినట్లుగా కొందరి నమ్మకం.

ఇక్కడ ఘంటమఠం లో మొత్తం నాలుగు శివలింగాలు ప్రతిష్టించి ఉన్నాయి. ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలసిన ఈ మహిమ గల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరు చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటె శ్రీశైలంలో మొత్తం ఐదు మఠాలు ఉన్నాయి. అయితే మొత్తం 6 శైవమఠాలు ఉండగా ఇందులో వీరభద్ర మఠం మినహాయిస్తే, ఘంటమఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారగందరమఠం కలిపి పంచ మఠాలు అంటారు. అయితే ఒకప్పుడు శ్రీశైలంలో వందకు పైగా మాటలు ఉండేవట కానీ కాలక్రమేణా అవి అంతరించిన ప్రస్తుతం ఈ మఠాలు మాత్రం ఉన్నవని కొందరు చెబుతున్నారు.

ఈవిధంగా పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రంలో దాగి ఉన్న ఈ ఘంటమఠంలో పూర్వం సాధువులు ఏకకాలంలో ఘంటను మ్రోగిస్తూ నీటి గుండం నుండి ఒకరు నీటికి అందిస్తుండగా ఒకరు సిద్దేశ్వర లింగాన్ని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అభిషేకించి ఆకాశగమనం అనే విద్య పొందినట్లుగా, చాలామంది సాధువులు, అఘోరాలు ఇక్కడ నిత్యం పూజలు చేసేవారని చెబుతున్నారు.

Exit mobile version