Home People సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?

సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి ?

0

భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం అహింస మార్గంలో పయనించడమో లేదా దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి బ్రటిష్ వారి నుండి బానిసత్వాన్ని పోగట్టడానికి కొందరి నాయకుల చేసిన పొరాటమో కాదు బ్రిటిష్ వారి స్వలాభం మరియు భారతదేశంలో ప్రముఖుల రాజకీయ స్వార్థం వలన ఒక గొప్ప వీరుడి రహస్య మరణానికి ప్రతిరూపమే ఆగస్టు 14 1947 లో వచ్చిన స్వాతంత్య్రం. తన జీవితంలో ఎప్పుడు అయన స్వార్థంగా ఆలోచించకుండా విశ్వాసంగా ఉంటూ 12 దేశాలు తిరిగి ఒక పెద్ద సైనిక బలగాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించిన ఒక గొప్ప యుద్ధ వీరుడు సుభాష్ చంద్రబోస్. అతని జీవితంలో కనుక ఎలాంటి రాజకీయ కుట్రలు జరగకుండా అయన ఆ రోజు భారతదేశానికి వచ్చి ఉంటె 1947 కంటే రెండు సంవత్సరాల ముందే మనకి స్వాతంత్ర్యం రావడమే కాకుండా బ్రిటిష్ వారిని మనకి బానిసలుగా చేసి ఉండేవాడు. చరిత్రలో ఇప్పటికి రహస్యంగానే ఉన్న సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న నిజాలు ఏంటి? రాజకీయంగా అతడు ఏర్పరిచిన సైనిక బలగాన్ని మట్టు పెట్టాలని చూసింది ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Netaji Subhas Chandra Bose

సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించారు. బాల్యం నుండే ఎక్కడ అన్యాయం జరిగిన ఎదురు నిలిచి అడిగేవాడు. ఇంటర్ చదివే రోజుల్లో స్వేచ్చా సేవ సంఘ్ అనే సంస్థ ఏర్పాటు చేసి యువకులకు సమాజ సేవ, ధ్యానం, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం వంటి అనేక అంశాల పైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. బోస్ కి స్వామి వివేకానంద అంటే ఎంతో ఇష్టం. ఇక 1919లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉత్తమ ర్యాంక్ సాధించి శిక్షణ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇక 1920 లో ఇంగ్లాండ్ లో జరిగిన ఎగ్జామ్ లోను మెరిట్ లో పాసయ్యారు. అయితే జలియన్ వాలా భాగ్ వార్త తెలిసిన అతడికి మనసులో ఆవేదన కలిగి దానిని మధ్యలోనే వదిలేసి 1921 లో ఇండియా తిరిగి వచ్చేసారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత అయన గాంధీగారిని కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరాడు. ఇలా చేరిన అయన చిత్తరంజన్ దాస్ వద్ద పనిచేసేవాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశాజ్ వచ్చినప్పుడు నిరసన చేసినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధించారు. ఇక అయన జైలు నుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు. జైలులో నిరాహార దీక్షకి తన ఆరోగ్యం క్షిణించడం చూసి బ్రటిష్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తు ఆయనను విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్స్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు. ఉప్పు సత్య గ్రహ సమయంలో బోస్ ని అరెస్ట్ చేయడం కాకుండా దేశ బహిష్కరణ కూడా చేసారు.

ఆ సందర్భంలో అయన యూరప్ లో పర్యటించి ఆ హిట్లర్, ముస్సోలిని వంటి మహానీయులను కలిసాడు. అయితే బోస్ హిట్లర్ ని కలసిన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. హిట్లర్ కోసం వేచి చూస్తుండగా ఒక అతను వచ్చి ఏంటి విషయం అని అడుగగా నేను మీ బాస్ హిట్లర్ తో మాట్లాడాలని జవాబిచ్చాడు. అయితే కొద్దిసేపటికి వచ్చిన హిట్లర్ బోస్ తో చర్చలు చేసి వెళుతుండగా ని దగ్గరికి ముందుగా వచ్చిన వ్యక్తి హిట్లర్ కాదని నీకెలా తెలిసింది అని ప్రశ్నించిగా, నా భుజాన్ని తట్టే ధైర్యం హిట్లర్ కి తప్ప మరెవ్వరికీ లేదని ఆయన జవాబిచ్చాడు.

అయితే 1934 వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు కి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స నిమిత్తం ఆయనని ఆస్ట్రియాకు తరలించారు. ఇలా ఆస్ట్రియలో చికిత్స పొందుతున్న ఆయన యూరప్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఏకం చేసి, వారు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ భావించారు. అయితే ఒక యూరోపియన్ పబ్లిషర్ ద ఇండియన్ స్ట్రగుల్ అని ఒక పుస్తకం రాయాలని కోరారు. అయితే ఇది రాయడానికి ఇంగ్లీష్ వచ్చి టైప్ చేయగలిగే ఒక వ్యక్తి అవసరం అయినప్పుడు బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్ ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు 23 ఏళ్ల ఎమిలీ షెంకెల్. బోస్ ఆ ఆస్ట్రియా యువతిని తన సహాయకురాలిగా నియమించుకున్నారు. ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించారు. ఇలా కొన్ని రోజుల్లో వారి మధ్య ప్రేమ చిగురించింది. స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేని అయనకి 1934-36 కాలంలో తన ప్రేమ జీవితం చాలా మధురమైనవిగా చెబుతారు.

ఇక భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక దేశం అంత తిరుగుతూ తన ఉపన్యాసాలతో దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నాయకుడయ్యాడు. ఇలా గొప్ప నాయకుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ లో అంతర్గతగా జరిగిన కుట్రల కారణంగా 1939 లో ఆయనను కాంగ్రెస్ నుండి బహిష్కరించారు. ఆ తరువాత వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని స్థాపించి దేశం అంతటా పర్యటించగా ఆయనకి మద్దతుగా కొన్ని లక్షల్లో జనాలు అయన వెంట నడిచారు. ఇలా ఉద్యమకారుడిగా ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తుండగా 1941 లో ఆయనని అరెస్ట్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కానీ అయన పథకం ప్రకారం హమ్మద్ జియా ఉల్ హక్అనే దొంగ పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి కాబుల్ కి వెళ్ళాడు. అక్కడ ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకి ఆశ్రయం కల్పించగా అక్కడ ఉంటూనే రష్యా, జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలు చేసాడు.

1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకొని జపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు. ఇలా చేరుకున్నబోస్ ని వారు స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు. ఆ తరువాత బోస్ అక్కడే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. 1941 ఫిబ్రవరి 27 న బోస్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం యావత్ దేశాన్ని కదిలించింది.

ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారు ఒక్కో ఓటమితో ఒక్కో ప్రాంతాన్ని వదిలివేస్తున్న సమయంలో జపాన్ వరుస విజయాలను నమోదు చేసింది. అయితే జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బోస్ ని అక్కడికి ఆహ్వానించగా 45 రోజుల పాటు జలాంతర్గామిలో ప్రయాణించి అక్కడ మత్సుడ అని పేరు మార్చుకున్నాడు. ఇక అక్కడ బోస్ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు. ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.

ఇలా ఎంతో శక్తివంతమైన సైన్యాన్ని తయారుచేసి చలో ఢిల్లీ అనే నినాదంతో ప్రత్యక్ష యుద్దానికి దిగి జపాన్ సహకారంతో ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా ఆయనకి కష్టాలు మొదలయ్యాయి. తనకి అండగా నిలిచినా జపాన్ దేశం యుద్ధంలో ఓటమికి చేరువైంది. ఇక బర్మాలో వరదల కారణంగా ఆరోగ్యం క్షిణిస్తూ అనేక మంది సైనికులు మరణించారు. ఆ సమయంలో రష్యా జపాన్ మీద అణుబాంబు దాడికి దిగి జపాన్ పైన అణుబాంబు వేసింది. దాంతో జపాన్ దేశం అతలాకుతలం అయింది. అప్పటివరకు తనకి అండగా ఉన్న జపాన్ అలా అవ్వడంతో బోస్ నిస్సహాయుడైనాడు. ఆ తరువాత సింగపూర్, రంగూన్ సైనిక దళాలకు బ్రిటిష్ దళాలు దగ్గరయ్యాయి. 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 1945 ఆగస్టు 18 వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో అయన మరణించినట్లుగా రేడియో లో ప్రకటించారు.

ఇక అయన మరణించలేదు అని అయన మరణం వెనుక ఏదో రహస్యం ఉందని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా అయన చాలా సంవత్సరాల వరకు బ్రతికే ఉన్నారని అనేక కథనాలు ఉన్నాయి. ఇందులో ముక్యంగా తీసుకుంటే, తైవాన్ కి సంబంధించిన ఎయిర్ క్రాష్ లో చంపేశారని కొందరు, ఆగస్ట్ 1945 తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నాడని చెప్పడం వల్ల అతను చనిపోలేదని మరికొందరు, సుభాష్ చంద్రబోస్ మారువేశంలో ఇండియాలోనే ఉన్నారని ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకునేవారు. ఇందులో మొదటగా అయన ఇంకా బ్రతికే ఉండొచ్చు అనే దానికి బలాన్ని ఇచ్చింది గాంధీజీ చేసిన వాక్యాలే అని చెప్పవచ్చు. తైవాన్‌లో విమాన ప్రమాదంలో బోస్‌ మరణించిన ఐదు నెలలకు ఆయన బతికే ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు 1946 జనవరిలో గాంధీ చెప్పారని బోస్‌ఫైల్స్‌.ఇన్ఫో అనే వెబ్ సైట్ తెలిపింది. ఆ తర్వాత నేతాజీ బతికే ఉన్నట్లు తన అంతర్బుద్ధికి అనిపించడం వల్ల అలా మాట్లాడానని అదే సంవత్సరం మార్చిలో హరిజన్‌ పత్రికలో గాంధీ రాశారు.

నేతాజీ అదృశ్యంపై 1949లో హౌరా సీఐడీ జరిపిన విచారణలో 1945 ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదమూ నమోదు కాలేదని తేలింది. నేతాజీ విమాన ప్రమాదానికి సంబంధించిన వదంతులు 1942 నుంచి 1944 వరకూ షికారు చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిందని భావించిన రోజున బ్యాంకాక్‌లోని నేతాజీతో ఆయన సోదరుడు శరత్‌ బోస్‌ మాట్లాడినట్లు రాయిటర్స్‌ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ అందిన రహస్య ఫైళ్ల సమాచారాన్ని బట్టి నేతాజీ 1945 విమాన ప్రమాదంలో మరణించలేదన్నది స్పష్టమవుతోంది.

ఇది ఇలా ఉంటె ఉత్తరప్రదేశ్‌ లోని ఫైజాబాద్‌ ప్రాంతంలో 1985 వరకూ గుమ్‌ నామీ బాబా అనే పేరుతో ఓ సాధువు ఉండేవారని ఆయనే సుభాష్ చంద్రబోస్ అన్న ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. ఇక ఫ్రెంచ్‌ సీక్రెట్‌ సర్వీస్‌ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్‌ ప్రాంతంలోని జైలులో బోస్‌ మరణించినట్లు చెబుతారు.

1999లో భారత ప్రభుత్వం మాజీ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎమ్ కే ముఖర్జీ ఆధ్వర్యంలో ముఖర్జీ కమిషన్ ని నియమించింది. నేతాజీ మరణంపై ఈ కమిషన్ దర్వాప్తు నిర్వహించింది. ఈ కమిటీ జపాన్, తైవాన్, రష్యాలు పర్యటించింది. బోస్ కి చెందిన అస్థికలుగా ప్రకటించి రెంకోజీ ఆలయంలో ఉంచినవి బోస్ వి కాదని హార్ట్ ఫెయిల్యూర్ తో జపాన్ కి చెందిన సైనికుడివని ప్రకటించింది ఈ కమిషన్. ఈ రిపోర్ట్ ని ముఖర్జీ కమిషన్ 2005 నవంబర్ 8న సబ్ మిట్ చేసింది. దీన్ని ఇండియన్ పార్లమెంట్ లో 2006 మే 17న ప్రవేశపెట్టారు. దీన్ని భారత ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పకుండా తిరస్కరించింది.

అయితే బోస్ మరణం వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లుగా చాలా మంది అనుమానం వ్యక్తం చేసారు. దీనికి కారణం విమాన ప్రమాదంలో చనిపోయాడు అని నిర్దారించినప్పటికీ బోస్ కుటుంబంపై భారత ప్రభుత్వ నిఘా అంశం చర్చనీయాంశమైంది. నేతాజీ అదృశ్యం తర్వాత నెహ్రు గారు ఆయన కుటుంబ సభ్యులపైనా వారికి వచ్చే ఉత్తరాలు ప్రత్యుత్తరాలపైనా నిఘా ఉంచారని తెలుస్తుంది. కోల్‌కతాలోని ఎల్గిన్‌ రోడ్డులోని పోస్టాఫీసులోను, జనరల్‌ పోస్టాఫీసులోనూ ఈ ఉత్తరాలను చదివే వారని తెలుస్తోంది. నేతాజీ సన్నిహితులైన కాంగ్రెస్‌ నేతలపైనా, ఆయన స్థాపించిన నేషనల్‌ ఆర్మీ అధికారులపైనా నిఘా ఉంచారని చెబుతారు. ఇలా అప్పటి ప్రభుత్వ హయాంలో 130 దాకా బోస్ రహస్య ఫైళ్లు ఉన్నట్లుగ తేలింది. అయితే ఈ మిస్టరీకి సంబంధించి భారత ప్రభుత్వం దగ్గర 10వేల ఫైల్స్ ఉంటే ముఖర్జీ కమిటీ దగ్గరకు వచ్చే సరికి అవి 993 మాత్రమే ఉన్నాయి. ఖోష్లా కమిటీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ముఖర్జీ కమిటీకి చేరలేదు. 30 ఫైల్స్ ని ఖోష్లా కమిటీ కాల్చేసింది. దీనివెనక ఏదో కుట్ర ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని కథనాల ఆధారంగా చూస్తే బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని అయన మిస్టరీ వెనుక రాజకీయ కుట్ర జరిగిందని చాల మంది అభిప్రాయం.

సైన్యానికి శిక్షణ ఇచ్చేప్పుడు అయన ఏమని చెప్పేవాడంటే, నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి. మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని సైన్యంలో విశ్వాసాన్ని చిగురించేలా చేసేవాడు.

ఇలా దేశం కోసం ఎవరు చేయని విధంగా అహింస వలన కాదు ఎదురెళ్లి పోరాడితేనే స్వాతంత్య్రం వస్తుందని కట్టు బట్టల్తో జపాన్ వెళ్లి ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసి బ్రిటిష్ సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి చివరికి రాజకీయ కుట్రకి బలై ఒక మిస్టరీగా మారిన భారతదేశం గర్వించ దగ్గ వీరుడు సుభాష చంద్రబోస్ కి సెల్యూట్.

Read : Akhand Swaroop Pandit : An Inspiring Story Of Clearing All Government Exams Till Date

Exit mobile version