Home Unknown facts ఈ ఆలయ కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సర్వరోగాలు మటుమాయం అవుతాయట

ఈ ఆలయ కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సర్వరోగాలు మటుమాయం అవుతాయట

0

దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు అనేవి ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో విశేషం అనేది ఉంటుంది. అలానే ఈ ఆలయంలో కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే సర్వరోగాలు మటుమాయం అవుతాయని ఒక నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tarakeswar Temple In Hooghly

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లా లో కలకత్తా నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పండాలె అనే గ్రామంలో తారకేశ్వర్ అనే ఆలయం ఉంది. శైవక్షేత్రాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడని పురాణం. ఇక్కడ వెలసిన ఈ స్వామివారిని తారకేశ్వరుడు అని, అమ్మవారిని తారకేశ్వరి అని పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో రాజా భరమల్లుడు నిర్మించాడు.

ఈ ఆలయ పురాణానికి వస్తే, ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలంలో పూర్వం ఆవులు తమ పాలని శివార్పణం చేసేవట, ఒకసారి రాజా భరమల్లుడు కలలో శివుడు కనిపించి తనకి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించామని చెప్పగా ఆ రాజు సంతోషించి శివాజ్ఞతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది.

ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయంలోని స్వామివారు ఎలాంటి మందులు లేకుండా వ్యాధులు నయం చేసే స్వామివారిగా ప్రసిద్ధి చెందాడు. ఇంకా ఈ ఆలయం దగ్గర ఉన్న కోనేటిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదిక్షిణ చేస్తే సర్వ రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. అంతే కాకుండా గుండెజబ్బులు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే తొందరగా నయం అవుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇంకా ఈ ఆలయంలో ఒక పక్కన గంటలు కొన్ని వందల సంఖ్యలో ఒకేదగ్గర ఉంటాయి. ఆలయంలో పూజ జరిగే సమయంలో భక్తులు ఈ గంటలని మోగిస్తుంటారు.

ఇలా ఎంతో ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలో శివరాత్రి రోజున జరిగే బ్రహ్మోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version