Home Unknown facts హిమాలయాల్లో 5 నిధులు ఒకేచోట ఉన్న పర్వతం

హిమాలయాల్లో 5 నిధులు ఒకేచోట ఉన్న పర్వతం

0

ప్రపంచంలో ఎత్తైన శిఖరాలలో కాంచనగంగ మూడవదిగా చెబుతారు. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని దైవంగా భావిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యకాంతిని బట్టి ఈ పర్వతం రంగులు మారుతుంది. పర్వత శిఖర పైభాగం వరకు ఎవరు వెళ్లకూడదనే నియమం ఒకటి ఉంది. అంతేకాకుండా ఈ పర్వతం ఐదు నిధులు కలిగి ఉన్న చోటు అని చెబుతారు. మరి ఈ పర్వతం ఎక్కడ ఉంది? కాంచనగంగ గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

3rd Tallest Mountain

హిమాలయాల పర్వతాలలో ఒక పర్వతమే కాంచనగంగా పర్వతం. నేపాల్, సిక్కిం తూర్పు తీరప్రాంతంలో ఉండే ప్రాంతమే కాంచనగంగ. ఈ శిఖరం సముద్రమట్టానికి సుమారు 8598 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని దైవంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఒకప్పుడు ఎవరైనా ఈ శిఖరాన్ని ఎక్కేముందు శిఖరం పై వరకు ఎవరు వెళ్లకూడదని చివర్లో కొంత దూరంలో ఆగిపోవాలని ఆదేశించాడట. ఇప్పటికి కూడా ఎవరు కూడా పూర్తిగా పైవరకు ఎక్కడకూడదనే నిబంధన ఉందని చెబుతారు.

ఇక కాంచనగంగ విషయానికి వస్తే, ఇక్కడ సూర్యోదయం అప్పుడు జరిగే అద్భుతాన్ని చూడాలని అనుకునేవారు డార్జ్లింగ్ మార్గ మధ్యలో ఉన్న టైగెర్ హిల్ ని దర్శించాలి. ఇక ఉదయం 5 గంటల సమయంలోనే టైగెర్ హిల్ కి చేరుకోగా అక్కడ ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది. మనం రోజు చూసే సూర్యోదయానికి, ఇక్కడ చూసే సూర్యోదయానికి ఎంతో తేడా అనేది కనిపిస్తుంది. అయితే టైగెర్ హిల్ ఉపరితలంపై సూర్యుడు తన కిరణాలతో కంచగంగ ని తరుముతున్నట్లుగా తొలి కిరణాలూ ప్రసరిస్తాయి. ఇలా సూర్యకిరణాలు లోయలోకి సాగుతుండగా పర్వతం తెల్లని కాంతులతో కనబడుతుంది. ఆ తరువాత బంగారు కాంతులతో మెరుస్తూ ఉంటుంది. ఆ తరువాత సూర్యుడు సంపూర్ణంగా దర్శనం ఇచ్చిన తరువాత చివరకు నీలం రంగులోకి మారిపోగా ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేవిధంగా అనుభూతి వస్తుంది.

హిమాలయలో ఉన్న ఇతర శిఖరాలతో పోలిస్తే కాంచనగంగ కి ఎన్నో ప్రత్యేకతలు అనేవి ఉన్నవి. ఈ పర్వత శిఖరం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ పర్వతాన్ని పంచముఖ పర్వతం అని కూడా పిలుస్తారు. ఇక ఈ పర్వతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి సిక్కిం వరకు విస్తరించి ఉంటుంది. ఈ అద్భుతం చూడాలంటే నేపాల్, సిక్కిం ప్రభుత్వాల అనుమతి అనేది తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే అనుమతి లేని ప్రయాణం ఇక్కడ చాలా కష్టం.

Exit mobile version